ముక్తసంగులు! భగవద్గీత Bhagavad Gita Chapter 18 - Part 127

ముక్తసంగులు! ప్రాపంచిక మమకారాసక్తితో వస్తువిషయముల పట్ల సంగము పెడితే? 'భగవద్గీత' అష్టాదశోధ్యాయం - మోక్ష సన్యాస యోగం (22 – 26 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పద్దెనిమిదవ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము. ఈ రోజుటి మన వీడియోలో, మోక్ష సన్యాస యోగములోని, 22 నుండి 26 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము.. సాత్విక జ్ఞానమూ, రాజసిక జ్ఞానముల గురించి తెలుసుకున్నాము.. ఇప్పుడు తామసిక జ్ఞానము గురించి చూద్దాము.. [ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/tS_FKddurio ] 00:50 - యత్తు కృత్స్నవదేకస్మిన్ కార్యే సక్తమహైతుకమ్ । అతత్త్వార్థవదల్పం చ తత్తామసముదాహృతమ్ ।। 22 ।। సంపూర్ణ సృష్టి అంతా, ఈ భిన్నభిన్న భాగములే అన్న విషయంలో, పూర్తిగా మనిషిని తలమునకలై పోయేట్టు చేసి, తర్కబద్ధముగా లేకుండా, మరియు సత్య దూరముగా ఉండే జ్ఞానము, తామసిక జ్ఞానమని చెప్పబడుతుంది. ఎప్పుడైతే బుద్ధి తమోగుణ ప్రభావముచే మందకొండిగా అయిపోతుందో, అప్పుడది, భిన్నత్వమే సంపూర్ణ సత్యమన్న భావనను పట్టుకుని ఉంటుంది. అటువంటి అవగా...