ముచికుందుడు King Muchukunda

ముచికుందుడు ఎవరు? యాదవులచేతిలో మరణం లేని వరాన్ని పొందిన కాలయవనుడిని కృష్ణుడు ఎలా చంపాడు? సూర్యవంశానికి చెందిన ముచికుందుడు, మహాపరాక్రమవంతుడు. మాంధాత కుమారుడైన ముచికుందుడిని యుద్ధంలో గెలవడం అసాధ్యం. వందలాది సైన్యాన్ని మట్టుపెట్టగల సమర్థుడు. కదనరంగాన మహా మహావీరులు సైతం ఆయనకు ఎదురు నిలువలేరు, ఆయన ధాటికి తట్టుకోలేరు. అందువల్లనే దేవతలు సైతం ఆయన సహాయాన్ని కోరేవారు. దీనిని బట్టే ఆయన ఏ స్థాయి పరాక్రమవంతుడనేది అర్ధం చేసుకోవచ్చు. త్రేతాయుగంలో జన్మించిన ముచికుందుడు ఇంకా జీవించే ఉన్నాడా? ద్వాపరయుగంలో జన్మించిన కృష్ణుడికీ, ముచికుందుడుకీ సంబంధం ఏమిటీ? ముచికుందుడు దేవతల నుండి పొందిన వరం ఏమిటి? అది కృష్ణుడికి ఎలా ఉపయోగపడింది? ముచికుందుడి వృత్తాంతానికి సంబంధించిన ఉత్సుకతను కలిగించే అంశాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము.. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/bVirKu3kTVI ] ఒకసారి దేవదానవుల మధ్య పోరు భీకరంగా సాగింది. దేవతలను జయించే పరిస్థితికి, దానవులు చేరుకున్నారు. అలాంటి సమయంలోనే, వాళ్లంతా ముచికుందుడి సహాయాన్ని కోరారు. దాంతో ఆయన దేవతల పక్షాన, అసురులతో పోరాడాడు. ముచికుందుడు యుద్ధరంగాన న...