మూలహేతువు! భగవద్గీత Bhagavadgita
మూలహేతువు! వ్యక్తిని ఉన్నతమైన స్థాయికి చేర్చేదేమిటి? 'భగవద్గీత' దశమోధ్యాయం - విభూతి యోగం (38 – 42 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 7 నుండి 12 వరకూ ఉన్న అధ్యాయాలను భక్తి షట్కము అంటారు. దీనిలో పదవ అధ్యాయం, విభూతి యోగము. ఈ రోజుటి మన వీడియోలో, విభూతి యోగములోని 38 నుండి 42 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము.. [ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/fOgRdtl3lig ] శ్రీ కృష్ణుడు తన మహిమలను ఇలా వివరిస్తున్నాడు.. 00:43 - దండో దమయతామస్మి నీతిరస్మి జిగీషతామ్ । మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహమ్ ।। 38 ।। న్యాయరాహిత్యాన్ని నివారించటానికి ఉన్న విధానాలలో, నేను ధర్మబద్ధమైన శిక్షనూ, జయాభిలాష గలవారిలో సత్ప్రవర్తననూ, రహస్యములలో నేను మౌనమునూ, జ్ఞానులలో జ్ఞానమును నేనే. మానవ స్వభావం ఎలాంటిదంటే, జనులలో మంచి నడవడిక కోసం, కేవలం ధర్మోపదేశం మాత్రమే సరిపోదు. సరియైన సమయంలో, న్యాయబద్ధంగా ఇవ్వబడిన దండన, మంచి నడవడిక, శిక్షణకూ మరియు పాపిష్ఠి ప్రవర్తన యొక్క సంస్కరణకూ సహకరించే ముఖ్యమైన ఉపకరణము. దీని లక్ష్యాల్లో ఒకటేమిటంటే, సమాజంలో చెడు పను...