Rules of Impurity (Sutaka or Ashoucha) as per Garuda Puranam గరుడ పురాణం ప్రకారం మృత్యు మైల!
మృత్యు మైల!? – గరుడపురాణంలో పరాశరుడు చెప్పిన ధర్మకర్మాలేమిటి? ఏ వర్ణానికి ఎన్నాళ్ళు మృత్యు అశౌచము లేక మైల వుంటుంది? అతి ప్రాచీన జోతిష్య శాస్త్రానికి ఆద్యుడూ, పరాశర హోర గ్రంథకర్త, వ్యాస భగవానుడి తండ్రి, పరాశర మహర్షి. అటువంటి మహనీయుడు చెప్పిన ధర్మసూక్ష్మాల విషయానికి వస్తే.. గరుడపురాణం ప్రకారం, నైమిశారణ్యంలో సూతుడు శౌనకాది మహామునులతో మాట్లాడుతూ, తన గురువైన వ్యాస మహర్షికి, ఆయన తండ్రి పరాశర మహర్షి వినిపించిన ధర్మకర్మాలను ఇలా చెప్పనారంభించాడు. “శౌనకాచార్యా! ప్రతి కల్పాంతంలోనూ, అన్నీ నశించిపోతాయి. కల్ప ప్రారంభంలో, మన్వాది ఋషులు వేదాలను స్మరించి, బ్రాహ్మణాది వర్ణాల ధర్మాలను మరల విధిస్తుంటారు. అంటూ ప్రారంభించి, మానవాళికి ఆయన వ్యక్తపరచిన విషయాలను తెలుసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను.. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/K0OBiPNIEsU ] త్యజేద్దేశం కృతయుగే త్రేతాయాంగ్రామ ముత్సృజేత్ । ద్వాపరే కులమే కంతు కర్తారంతు కలౌయుగే ।। కలియుగంలో దానమే ధర్మము. పాపమూ, శాపమూ సర్వాంతర్యాములుగా పరిఢవిల్లే ఈ కలియుగంలో, పాపాన్...