Discover the REAL Story Behind Kumbh Mela! | 'కుంభ' మేళా! లక్షల సంవత్సరాల చరిత్ర!
కుంభమేళా! లక్షల ఏళ్ల చరిత్ర! 144 ఏళ్ళకు ఒకసారి వచ్చే మహాకుంభమేళా! ఇదే నేడు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రధాన వార్తా పత్రికలలోనూ కనిపిస్తున్న ముఖ్య వార్త.. అన్ని దేశాలూ, అంతరీక్షంలో ఉన్న శాటిలైట్స్ సహాయంతో వీక్షించాలని తహతలాడుతున్న ఏకైక పరిణామం, ఆఖరికి ఇస్లాం పుట్టుకకు మూలమైన మధ్య ఆసియా దేశాల ప్రజల నుంచి, మన పొరుగునే ఉన్న పాకిస్తాన్ లోని జనాల వరకూ, ఒక్కసారైనా వెళ్ళాలని అనుకుంటున్న డెస్టినేషన్, అఖండంగా, ఆమోఘంగా, దేదీప్యమానంగా, ఏ బాష వర్ణనకీ అందనంత ఘనంగా మన దేశంలో జరుగుతున్న మహాకుంభమేళా గురించే అని చెప్పడం, ఎంత మాత్రమూ అతిశయోక్తి కాదు.. భారత దేశంలోని ఉత్తర్ ప్రదేశ్ లో గల ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకి తరలి వస్తున్న కోట్లాదిమంది భక్తులనూ, అక్కడికి వచ్చే ఎందరో నాగ సాధువులు, అఘోరాలు, యోగులూ, మహాపురుషుల వంటి వారిని చూసి, ప్రపంచం మొత్తం తాదాత్మ్యం చెందుతోంది. ఈ క్రమంలో ఇతర దేశస్థులతో పాటు, మన దేశంలో ఉన్న చాలా మందికి, అసలు కుంభమేళ అంటే ఏమిటి..? మహా కుంభమేళ విశిష్టత ఏమిటి..? ఇది ఎప్పుడు మొదలైంది..? ఎలా మొదలైంది..? కుంభమేళా పూర్తి చరిత్ర ఏమిటి..? వంటి ఎన్నో సందేహాలు కలుగుతాయి. మరి అటువంటి...