Did Lakshman kill his son-in-law? #ramayana | లక్ష్మణుడు తన అల్లుడిని చంపాడా?
లక్ష్మణుడు తన అల్లుడిని చంపాడా? ‘సమాధి కళ’ను పొందిన ఇంద్రజిత్తు మరణ రహస్యం ఏంటి? రామాయణం ప్రకారం, రావణ మండోదరిలకు జన్మించిన జ్యేష్ఠ పుత్రుడు, మేఘనాథుడు. మేఘనాథుడు, శైవ యాగం చేసి శివుని మెప్పించి, ‘సమాధి కళ’ను పొందాడు. దీని వల్ల అతడు అందరిలో ఉన్నా, ఎవరికీ కనిపించడు. అతనికి మాత్రం, అందరూ కనిపిస్తారు. అమోఘమైన శక్తులను పొందిన మేఘనాధుడు, ఇంద్రజిత్తుగా ఎలా మారాడు? లక్ష్మణుడి చేతిలో ఎలా వధింపబడ్డాడు? ఇంద్రజిత్తుకు తన మరణం గురించి ముందే తెలుసా? అనేటటువంటి ఉత్సుకతను రేకేత్తించే అంశాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము.. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/_xD_6-POHho ] మేఘనాధుడు ఇంద్రుణ్ణి జయించడం వల్ల, ఇంద్రజిత్తు అని పేరు వచ్చింది. రావణుడు ఒకనాడు దేవలోకంపై దండెత్తాడు. రాక్షస సేన దేవలోకాన్ని చుట్టుముట్టింది. ఇంద్రుడు రావణుడితో తలపడ్డాడు. మేఘనాథుడు, శివుడు తనకు వరంగా ఇచ్చిన మాయా రూపంలో, ఇంద్రుని కుమారుడు జయంతుని, అస్త్రాలతో ముంచెత్తగా, అతడు పడిపోయాడు. ఇంద్రుడి తండ్రి పులోముడు, జయంతుడిని తీసుకుని వెళ్ళి, సముద్రంలో దాచాడు. ఈ విషయం తెలిసి కోపోద్రిక్తుడైన ఇంద్రుడు, వజ్రాయుధంతో రావణ...