Posts

Showing posts with the label విశ్వరూప దర్శనం!

విశ్వరూప దర్శనం! భగవద్గీత Bhagavadgita

Image
విశ్వరూప దర్శనం! అనంతమైన ఆకృతులూ, మరియు వర్ణములతో కూడిన భగవానుడి విశ్వరూపము! 'భగవద్గీత' ఏకాదశోధ్యాయం – విశ్వరూప దర్శన యోగం (01 – 05 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 7 నుండి 12 వరకూ ఉన్న అధ్యాయాలను భక్తి షట్కము అంటారు. దీనిలో పదకొండవ అధ్యాయం, విశ్వరూప దర్శన యోగము. ఈ రోజుటి మన వీడియోలో, విశ్వరూప దర్శన యోగములోని 1 నుండి 5 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము.. [ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/F3yPQAg34Q4 ] ఈ పదకొండవ అధ్యాయంలో అర్జునుడు, శ్రీ కృష్ణుడి విశ్వ రూపమును చూడాలని ప్రార్ధిస్తున్నాడు. సమస్త విశ్వములూ తనలోనే కలిగి ఉన్న అనంతమైన విశ్వ రూపాన్ని, శ్రీ కృష్ణుడు అర్జునుడి దివ్య దృష్టికి చూపించాడు. 00:54 - అర్జున ఉవాచ । మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మసంజ్ఞితమ్ । యత్త్వయోక్తం వచస్తేన మోహోఽయం విగతో మమ ।। 1 ।। నా మీద దయచే నీవు తెలియపరచిన ఈ యొక్క పరమ రహస్యమైన ఆధ్యాత్మిక జ్ఞానము విన్న తరువాత, నా మోహము ఇప్పుడు తొలగిపోయినది. శ్రీ కృష్ణుడి విభూతులనూ, మరియు పరమేశ్వరుని యొక్క జ్ఞానమునూ విన్న పిదప, అర్జునుడు ఆనందముతో ఉప్పొంగ...