Shocking Facts About Shiva's Physical Appearance | శివుడి గురించి చాలామందికి తెలియని నమ్మలేని నిజాలు!
శివుడి గురించి చాలామందికి తెలియని నమ్మలేని నిజాలు!? ఆది మధ్యాంత రహితుడు, నిరాకారుడు, నిష్కళంకుడు, జటాజూట ధారి, నీలకంఠుడు, తినేత్రుడు, స్మశాన వాసి, కైలాస నివాసి, త్రిశూల ధరుడు అంటూ శత కోటి నామాలతో, అంతులేని సద్గుణాలు కలిగిన ఆ పరేమేశ్వరుడిని కొలుస్తూ ఉంటాము. స్వభావరీత్యా లయకారుడే అయినా భోళా శంకరుడు ఆ మహేశ్వరుడు. ఇలా వర్ణిస్తూ పోతే జీవిత కాలం సరిపోదు. మన వేద, పురాణ, ఇతిహాసాలలో, ఆ శివయ్య స్వభావం గురించీ, ఆయన రూపు రేఖల గురించీ ఎంతో వివరణ ఉంది. అందులో స్వామి ఎక్కువగా నాగుపామును మేడలో ధరించి, ఒంటికి పులి చర్మం కట్టుకుని, ఒళ్ళంతా చితాభస్మం పూసుకుని తిరుగుతాడనీ, లింగ రూప ప్రియుడనీ తెలిసిందే. అసలు ఆయన నిజ స్వరూపం ఎలాంటిది? ఆయన ఎంత ఎత్తు ఉంటాడు? ఆయనకి శివుడనే పేరెలా వచ్చింది? అసలు ఆయన మానవ రూపంలో ఉంటాడా? లేక గ్రహాంతర వాసిలా కనిపిస్తాడా? వంటి అనేక సందేహాలకు సమాధానాలు తెలుసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను పూర్తిగా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను.. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/vPad4lqMF48 ] మానవ మేధస్సు ఎంత వృద్ధి చెందినా, ఈ విశాల విశ్వాన్ని సృ...