Shraadh: An In-Depth Guide to Hindu Ancestral Rituals - The Garuda Purana | 'శ్రాద్ధాలు' - గరుడ పురాణం!

'శ్రాద్ధాలు' - గరుడ పురాణం! మరణించిన వారి పేరు మీద బ్రాహ్మణులకు పెట్టే భోజనం ఎవరికి చేరుతుంది? మన సనాతన ధర్మంలో, పూర్వీకులకు అంకితం చేయబడిన, సంవత్సరంలోని నిర్దిష్ట కాలాన్ని, పితృ పక్షం అంటారు. పితృపక్షం సమయంలో, పూర్వీకులు తమ వారిని కలవటం కోసం, భూమి మీదకు వస్తారని కూడా చెబుతారు. ఈ సమయంలో స్నానం, దానం, తర్పణం, శ్రార్ధ కర్మలు చేసినప్పుడు, పూర్వీకుల ఆత్మ సంతృప్తి చెంది, సుఖ సంతోషాలతో వర్ధిల్లేటట్లు దీవిస్తారని చెబుతారు. ప్రతి ఏడాదీ, పితృపక్షాలు భాద్రపద మాసంలో, కృష్ణ పక్షంలో వస్తూ ఉంటాయి. అయితే, మనం ఇక్కడ చేసే తద్దినాలూ, శ్రాద్ధాలూ, మరణించిన మన పితరులకు ఏ విధంగా చేరతాయి? బ్రాహ్మణులకు పెట్టే భోజనం, అన్ని వర్ణాల పితృదేవతలకూ సంతృప్తి చేకూరుస్తుందా - వంటి అనేక ప్రశ్నలను, గరుడ పురాణం, ఆచారకాండలో, గరుడుడు శ్రీ మహా విష్ణువును అడిగాడు. పితృకార్యక్రమాలకు సంబంధించి, గరుడుడు అడిగిన ప్రశ్నలకు, శ్రీ మహా విష్ణువు చెప్పిన దివ్య సమాధానాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము.. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/enEKiyfwnxs ] సపిండీకరణ, వార్షిక శ్రాద్ధాల తరువాత, మృత వ్యక్తికి తన స్వకర...