సత్కర్మలు చేస్తే సత్ఫలితాలే వస్తాయి! Karma Siddhantha
మన జీవితాలలో చాలా కష్టాలకు కారణం పూర్వ జన్మ కర్మలే! ప్రారబ్ద కర్మ ఎలా ఉంటుందో పురాణాలలోనే కాకుండా, నిత్య జీవితంలో కూడా అనుభవిస్తూ ఉంటాం మనం! రాముడు దండకారణ్యంలో 14 ఏళ్ళు అరణ్యవాసం చేయడానికి కారణం ఒక మహా పతివ్రత శాపం! సత్య యుగంలో దేవాసుర సంగ్రామ సమయంలో, మృత సంజీవనీ మంత్ర బలంతో, చావు లేకుండా, దౌర్జన్యాలు చేస్తున్న రాక్షసులను తుద ముట్టించడానికి, శ్రీమహావిష్ణువు సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. తనను శరణు వేడిన రాక్షసులను తన ఆశ్రమంలో దాచి, వారిని చంపకుండా తాను గుమ్మం ముందు నిలుచుందా ఋషి పత్ని! విధి లేక శ్రీమహావిష్ణువు, ఆమెను కూడా రాక్షస సంహారంలో భాగంగా, తన సుదర్శన చక్రంతో హతమార్చాడు. ఇది తెలిసి అక్కడికి వచ్చిన మహా తపోధనుడైన ఆమె భర్త, హతురాలై పడి ఉన్న భార్య శవాన్ని చూసి విలపిస్తూ, శ్రీమహావిష్ణువును శపించాడు. తన భార్యను హతమార్చి, తమకు పత్నీ వియోగం కల్పించినందుకు గాను, అతడు కూడా భార్యా వియోగంతో బాధపడాలని శపించాడు! అందుకే త్రేతాయుగంలోని రామావతారంలో, రాముని వనవాసానికి కైక, మందర లేదా దశరథుడు కారణం కాదనీ, వారు నిమిత్త మాత్రులనీ స్పష్టమౌతున్నది. ఇక్కడ మనం గమనించ వలసినది, అవతార పురుషుడైన శ్రీరాముడికి...