Posts

Showing posts with the label సన్యాసం

సన్యాసం – త్యాగం! భగవద్గీత Bhagavad Gita Chapter 18

Image
సన్యాసం – త్యాగం! మనో-ఇంద్రియములను నియంత్రణ లోకి తెచ్చుకోవటం గురించి శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? 'భగవద్గీత' అష్టాదశోధ్యాయం - మోక్ష సన్యాస యోగం (01 – 05 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పద్దెనిమిదవ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము. ఈ రోజుటి మన వీడియోలో, మోక్ష సన్యాస యోగములోని, 01 నుండి 05 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము.. [ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/DDbEuJl80CU ] నిత్యసనాతనమైన సూత్రములనూ, మరియు శాశ్వత సత్యమునూ గూర్చిన వివరణను చూద్దాము.. 00:47 - అర్జున ఉవాచ । సన్న్యాసస్య మహాబాహో తత్త్వమిచ్ఛామి వేదితుమ్ । త్యాగస్య చ హృషీకేశ పృథక్కేశినిషూదన ।। 1 ।। అర్జునుడు ఇలా అంటున్నాడు: ఓ మహా బాహువులు గల కృష్ణా.. 'సన్యాసము', కర్మలను త్యజించటము, 'త్యాగము', మరియు కర్మఫలములను భోగించాలనే కోరికను త్యజించటము యొక్క స్వభావాన్ని, తెలుసుకో గోరుతున్నాను. ఓ హృషీకేశా, వాటి మధ్య భేదమును కూడా తెలుసుకోవాలని కోరిక ఉన్నది ఓ కేశినిషూదనా.. అర్జునుడు శ్రీ కృష్ణుడిని...