సఫల ఏకాదశి - Saphala Ekadashi
'సఫల ఏకాదశి' విశిష్టత.. ధనుర్మాసంలో వచ్చే చివరి పండుగ అయిన సఫల ఏకాదశి గురించి తెలుసుకుందాము.. ఈ సఫల ఏకాదశి మహాత్మ్యాన్ని, పాండవుల్లో అగ్రజుడైన ధర్మరాజుకు శ్రీ కృష్ణుడు చెప్పినట్లు, శాస్త్రాలు చెబతున్నాయి. మార్గశిర మాసంలో వచ్చే బహుళ ఏకాదశినే, సఫల ఏకాదశి అని అంటారు. ఈ రోజున నిష్ఠతో ఉవవసించి, జాగరణ చేసి, శ్రీ విష్ణుమూర్తిని పూజించడం ద్వారా, పాపాలు నశించిపోతాయి, ముక్తి లభిస్తుంది. ఈ రోజున శ్రీ మహా విష్ణువును ఉసిరితోనూ, దానిమ్మ పండ్లతోనూ పూజించే వారికి, సకల సంపదలో చేకూరుతాయి. ఈ రోజున రకరకాల పండ్లను స్వామికి సమర్పించి, ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తే, శుభప్రదం. ఈ సఫల ఏకాదశి రోజున దీప దానం చేస్తే, జీవితంలో విశేషమైన ఫలితాలు కలుగుతాయి. సఫల ఏకాదశి రోజున జాగరణ చేసి, ఆలయాలలో దీపాలను వెలిగిస్తే, ఐదువేల సంవత్సరాలు తపస్సు చేసిన ఫలితం దక్కుతుంది. దీనికి సమానమైన యజ్ఞం కానీ, తీర్థం కానీ లేదు. సఫల ఏకాదశి పవిత్రను చాటిచెప్పే కథను కూడా, శ్రీకృష్ణుడు పాండవులకు చెప్పినట్లు, పురాణాలు చెబతున్నాయి. పూర్వం చంపావతి రాజ్యమును మహిష్మంతుడనే రాజు పాలించేవాడు. అతనికి నలుగురు కుమారులుండేవారు. వారిలో జేష్ఠ పుత్రు...