HONDURAS: Lost City of the Monkey God! ‘అద్భుత నగరం’ ఆనవాళ్ళు!
మకరధ్వజుడేలిన ‘అద్భుత నగరం’ ఆనవాళ్ళు! అమెరికాలో? HONDURAS: Secrets of a Lost City of the Monkey God! అనిలాత్మజుడు ఆజన్మ బ్రహ్మచారనీ, శివుడికి కైలాసంలాగా, విష్ణుమూర్తికి వైకుంఠంలాగా, ఆంజనేయ స్వామికి ఒక చోటంటూ ఉండదనీ, ఆయన నిరంతర రామనామ జపం జరిగే ప్రదేశాలలో, అదృశ్య రూపంలో తిరుగుతూ ఉంటాడనీ మనకు తెలిసిందే. మరి అటువంటి హనుమంతుడి కొడుకు ఎవరు? అతడేలిన ఒక మహా నగరాన్ని కొత్తగా కనుగొన్నారా?... అవును.. ఆ నగరం మన దేశంలోనో, లేక ఆసియా ఖండంలోనో కాకుండా, భూమికి ఆవలి వైపున ఉన్న మరో ఖండంలో ఉంది! అక్కడ కొన్ని వేల ఏళ్లుగా హనుమంతుడిని కోలుస్తున్నారు! మరి చాలామందికి తెలియని ఆ విషయాలకోసం, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను.. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/_5M8nrRGuYE ] అది 1940వ సంవత్సరం.. దక్షిణ అమెరికా ఖండంలోని Honduras అనే ఒక చిన్న దేశం. నేటివ్ అమెరికన్ల సంస్కృతీ సంప్రాదాయలకు సంబంధించిన వివిధ రకాల పురాతన వస్తువులను సేకరించి, తన మ్యుజియంలో భద్రపరిచే George Gustav Heye అనే వ్యక్తి, మొదటి సారి ఆ దేశంలో అడుగుపెట్టాడు. అతను ఆ దేశా...