‘పిచ్చుకలు’ జాబాలి మహర్షికి చెప్పిన గుణపాఠం! Jaabaali Maharshi
‘పిచ్చుకలు’ జాబాలి మహర్షికి చెప్పిన గుణపాఠం! పిచ్చుకల రూపంలో ధర్మదేవతలు జాబాలికి నేర్పిన గుణపాఠం ఏమిటి? మన పురాణ ఇతిహాసాలలో ఎంతో మంది మునులూ, రుషులూ ఉన్నా, వారిలో జాబాలి మహర్షి ఎంతో ప్రాముఖ్యతను సంపాదించుకున్నారు. ప్రకృతి ద్వారా బ్రహ్మజ్ఞానాన్ని సముపార్జించి, గొప్ప వ్యక్తిగా కీర్తిని గడించిన జాబాలికి, ఒక వ్యాపారస్థుడు తెలియజేసిన ధర్మ సూక్ష్మం ఏంటి? జాబాలి గోత్రానికే మూలమైన ఆయనకు, ధర్మదేవతలు ఎందుకు గుణపాఠం నేర్పారు - వంటి ఆసక్తికర విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము.. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/L4UeG2rUorU ] ఒకానొకప్పడు జాబాలి అనే కుర్రవాడు ఉండేవాడు. తన తోటివారంతా వేదవిద్యను అభ్యసిస్తుంటే, జాబాలికి కూడా జ్ఞానాన్ని ఆర్జించాలన్న కోరిక కలిగింది. తనను శిష్యునిగా చేర్చుకోమని, గౌతమ మహర్షి దగ్గరకు వెళ్లి అర్థించాడు జాబాలి. అప్పుడు గౌతముడు, అతడి తల్లిదండ్రులూ, గోత్ర నామాదుల వివరాలు అడిగాడు. ఆ ప్రశ్నకు జాబాలి దగ్గర జవాబు లేకపోయింది. ఎందుకంటే, చిన్ననాటి నుంచి, అతను తన తండ్రిని ఎరుగడు. ఇక తన గోత్రమూ, తనకు తెలియదు. అందుకని, దాసిగా పనిచేసే తన తల్లి దగ్గరకు వెళ్లి, గౌత...