హనుమత్ విజయోత్సవ దినం 2024 Hanuman Jayanti
అందరికీ హనుమత్ విజయోత్సవ శుభాకాంక్షలు 🚩 జై శ్రీహనుమ 🙏 ఈ రోజు చైత్ర పూర్ణిమ - హనుమత్ విజయోత్సవ దినం.. చాలా మందికి వున్న సందిగ్ధం, హనుమాన్ జయంతి ఎప్పుడు? హనుమాన్ విజయోత్సవ దినం ఎప్పుడనేది.. హనుమంతుని జన్మ తిథి చైత్ర మాసం లోనా, వైశాఖంలో చేసుకోవాలా అనే అనుమానం చాలామందికి ఉంటుంది.. అలాంటి వారు ఈ కథనం చదివి, సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. [ హనుమంతుడు తీర్చిన తుంబుర నారదుల వివాదం: https://youtu.be/PDJaB6-eRmQ ] పరాశర సంహిత అనే గ్రంథం ప్రకారం, ఆంజనేయుడు వైశాఖ బహుళ దశమి, శనివారం రోజున జన్మించారని తెలుపబడింది.. అదే రోజున హనుమంతుని జన్మ తిథి చేసుకోవాలని చెబుతారు. [ హనుమకు సీతమ్మ చెప్పిన ‘బోయవాడు - ఎలుగుబంటి’ కథ!: https://youtu.be/YK8QjVW2kc0 ] అయితే, కొన్ని ఇతిహాసాల ప్రకారం, చైత్ర పౌర్ణమినాడు నికుంభుడు, తదిరత రాక్షసులను సంహరించి, హనుమంతుడు విజయం సాధించినట్లు వ్యక్తమవుతోంది. ఈ కారణంగా, ఆ రోజున హనుమద్ విజయోత్సవం చేసుకునే సంప్రదాయం కొన్ని చోట్ల ఉంది. దీన్ని ఉత్తరాదిలో హనుమంతుని జన్మ తిథిగా చేసుకుంటారని పండితులు సూచిస్తున్నారు. అలాగే, చైత్ర పూర్ణిమ నాడు "హనుమంతుని విజయోత్సవం" దక్షిణా...