Posts

Showing posts with the label 2025

ఛత్రపతి శివాజీ జయంతి 2025 Chhatrapathi Shivaji Maharaj Jayanthi

Image
అందరికీ 'ఛత్రపతి శివాజీ జయంతి' శుభాకాంక్షలు 💐  TELUGU VOICE స్వతంత్ర మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి, హిందూ మతధర్మాన్ని పరిరక్షించిన ఘనత, ఛ‌త్ర‌ప‌తి శివాజీకే దక్కుతుందనడంలో అతిశయోక్తిలేదు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఖ్యాతి పోందిన శివాజీ రాజే భోంస్లే, 1630 ఫిబ్ర‌వ‌రి 19న షాహాజీ, జిజాబాయి పుణ్య దంప‌తుల‌కు జ‌న్మించాడు. శివాజీ తండ్రి, వ్య‌వ‌సాయ బోస్లే కులానికి చెందిన వారు. అత‌ను నిజాంషాహీల ప్రతినిధిగా ఉంటూ, మొఘల్ రాజులను వ్యతిరేకిస్తూ యుద్ధాల్లో పాల్గొనేవాడు. త‌ల్లి జిజాబాయి యాద‌వ క్ష‌త్రియ వంశ‌పు ఆడ ప‌డుచు. శివాజీకి ముందు పుట్టిన వారంద‌రూ మృతి చెందారు. దాంతో జిజాబాయి, తాను పూజించే పార్వ‌తీ దేవి మరోపేరైన శివై పేరును క‌లిపి శివాజీకి పెట్టింది. ఆమె సంర‌క్ష‌ణ‌లో పెరిగిన శివాజీ, రామాయ‌ణ‌ మ‌హాభార‌తాల‌ విశిష్ట‌తనూ, హిందూమ‌తం యొక్క గొప్ప‌త‌నాన్నీ తెలుసుకున్నాడు. ప‌ర‌మ‌త స‌హ‌నం, స్త్రీలను గౌర‌వించ‌డం, శివాజీకున్న గోప్ప ల‌క్ష‌ణం. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/it7JY1jp20A ] దాదాజీ ఖాండ్ దేవ్ ద‌గ్గ‌ర శిక్ష‌ణ తీసుకున్న శివాజీ, వీరుడిగా యుద్ద రంగంలో అడుగుపెట్టాడు. తండ్రి ప‌రాజ‌యాల‌క...

భీష్మ ఏకాదశి 2025 Bhishma Ekadashi

Image
ఈ రోజు 08-02-2025 'భీష్మ ఏకాదశి' విశేషం   TELUGU VOICE మాఘ శుక్ల ఏకాదశినే భీష్మ ఏకాదశి అంటాము. శ్రీ విష్ణు సహస్రనామం భీష్మపితామహుడు పాండవులకు చేసిన మహోపదేశం. భారత సంగ్రామం పూర్తి అయిన తర్వాత భీష్మపితామహుడు అంపశయ్యపైనే ఉండి పొయ్యాడు. ఎక్కడి వాళ్ళు వారి వారి రాజ్యాలకు వెళ్ళి పోయారు. సుమారు నెల రోజులు గడిచాయి, పాండవులు శ్రీకృష్ణుడు సల్లాపాలు ఆడుకొనే ఒక సమయంలో ఒక నాడు హటాత్తుగా శ్రీకృష్ణుడు పాండవులతో మాట్లాడుతూ ఆగిపోయాడు. పాండవులకు గాబరా వేసింది. ఏమైంది అని శ్రీకృష్ణుడిని అడిగారు. శ్రీకృష్ణుడు వారికి సమాధానం చెబుతూ "మాంధ్యాతి భగవాన్ భీష్మః తపోమే తద్గతం మనః" కురుక్షేత్రంలో అంపశయ్యపై పవళించి ఉన్న భీష్మపితామహుడు నన్ను స్మరించుకుంటున్నాడు. అందుకే నామనస్సు అక్కడికి వెళ్ళి పోయింది. 'హే పాండవులారా! బయలుదేరండి, భీష్ముడి దగ్గరికి. ఎందుకంటే భీష్ముడు ఆస్తికాగ్రేసరుడు, ధర్మాలను అవపోశణం పట్టినవాడు. శాస్త్రాలను పూర్తిగా ఆకలింపు చేసిన మహనీయుడు. మానవాళి తరించడానికి కావల్సిన మార్గాలను స్పష్టంగా తెలిసిన మహనీయుడు. సులభంగా జీవకోటిని తరింపజేయడం ఎట్లానో అవగతం చేసుకొన్న మహనీయుడు. ధర్మ విషయం...