Posts

Showing posts with the label Abhisheka Mantra

శివరాత్రి నాడు అభిషేకం చేస్తూ ఏ మంత్రాన్ని జపిస్తే మంచిది? Abhisheka Mantra

Image
శివరాత్రి నాడు అభిషేకం చేస్తూ ఏ మంత్రాన్ని జపిస్తే మంచిది? ఆ పరమేశ్వరుడు అభిషేక ప్రియుడని, శాస్త్ర వచనం. అంతేకాదు, ఆ శివయ్యకు.. పాలు, నీళ్ళు, పంచదార, పంచామృతాలు, ఇలా ఒక్కో రకమైన ద్రవ్యంతో అభిషేకం చేస్తే, ఒక్కో విధమైన ఫలితం ఇస్తాడాని, వేదాలు చెబుతున్నాయి. అందులోనూ, మహా శివరాత్రి లాంటి పర్వదినంలో, పరమేశ్వరుడికి చేసే అభిషేకాలు, మరింత పుణ్యం చేకూరుస్తుందని, శాస్త్రాలు చెబుతున్నాయి. అందువల్ల, రాబోయే శివరాత్రి నాడు, భక్తకోటి మొత్తం, స్వయంగా శివ లింగానికి అభిషేకం చేయాలని, ఆశిస్తారు. అయితే, ఇలా అభిషేకం చేసే సమయంలో, ఏ విధమైన మంత్రాలు చదవాలి? ఏ మంత్రాలు చదివితే స్వామిని ప్రసన్నం చేసుకోగలం? అనే సందేహాలు, మనలో చాలా మందికి ఉంటాయి. మరి ఆ సందేహాలకు సమాధానాలు చూడండి. భక్తితో, త్రికరణ శుద్ధిగా పోసే చెంబెడు నీళ్ళు చాలు, ఆ భోళా శంకరుడి కరుణకు పాత్రులవ్వడానికని, పెద్దలు చెబుతూ ఉంటారు. అభిషేక ప్రియుడిగా పేరు తెచ్చుకున్న ఆ పరమేశ్వరుడికి, ఎన్ని పూజలు చేసినా, కాసిన్ని నీళ్ళతో కానీ, ఆవు పాలతో కానీ అభిషేకం చేస్తే, మన బాధలన్నీ దూరం చేసేస్తాడు. అందుకే, ఆ స్వామికి ప్రపంచ వ్యాప్తంగా, ప్రతి రోజు అభిషేకాలు జరుగుతూనే ...