తరతరాల సనాతన సాంప్రదాయాలు! Ancient Hindu Traditions

మనం మరచి పోతున్న కొన్ని, తరతరాల సనాతన సాంప్రదాయాలు! సోమవారం తలకు నూనె రాయరాదు. ఒంటి కాలిపై నిలబడ రాదు. మంగళ వారం పుట్టినింటి నుండి కూతురు అత్తారింటికి వెళ్లరాదు. శుక్రవారం నాడు కోడలిని పుట్టినింటికి పంపరాదు. గుమ్మడికాయ ముక్కలనే ఇంటికి తేవాలి. ఇంటిలోపల గోళ్ళు కత్తిరించరాదు. మధ్యాహ్నం తులసి ఆకులను కోయరాదు. సూర్యాస్తమయం తరువాత కసవు వూడ్చరాదు, తల దువ్వరాదు. పెరుగును, ఉప్పును అప్పు ఈయరాదు. వేడి వేడి అన్నంలో పెరుగు వేసుకోరాదు. భోజనం మధ్యలో లేచిపోరాదు. తల వెంట్రుకలు ఇంట్లో వేయరాదు. గడపపై పాదం పెట్టి వెళ్లరాదు. ఇంటినుండి బయటకు వెళ్ళేటప్పుడు కసవూడ్చరాదు గోడలకు పాదం ఆనించి పడుకోరాదు. రాత్రి వేళలో బట్టలుతకరాదు. విరిగిన గాజులు వేసుకోరాదు. నిద్ర లేచిన తరువాత పడుకున్న చాపను మడిచి పెట్టాలి. చేతి గోళ్ళను కొరకరాదు. అన్న తమ్ముడు,తండ్రి కొడుకు ఒకే సారి క్షవరం చేయించుకోరాదు. ఒంటి (సింగిల్) అరిటాకును తేరాదు. సూర్యాస్తమయం వేళలో నిద్ర పోరాదు. కాళ్ళు కడిగేటప్పుడు మడమలను మరచిపోరాదు. ఇంటి గడపపై కూర్చోరాదు. తిన్న తక్షణమే పడుకోరాదు. పెద్దల సమక్షంలో కాలుపై కాలు వేసుకుని, కాళ్ళు చాపుకుని కూర్చోరాదు. చేత...