అష్టదిగ్బంధనం! Ashta Digbandhanam - Arunachaleswara, Tiruvannamalai
అష్టదిగ్బంధనం! అష్టదిక్పాలకుల బంధనంలో అరుణాచలం! తిరువణ్ణామలై అరుణాచలేశ్వరుడు అష్టలింగాలతో దిగ్బంధనం చేయబడ్డాడా? సనాతన సాంప్రదాయంలో అష్ట దిక్కులకూ, ఆ దిక్కులను పాలించే అష్ట దిక్పాలకులకూ ఎంతో ప్రాధాన్యత ఉంది. వాస్తు శాస్త్రం ప్రకారం అలా ఎనిమిది దిక్కులలోనూ ఎనిమిది మంది ఉప దేవతలైన దిక్పాలకుల శక్తిని నిక్షేపించి, ఒక రక్షణ వలయాన్ని ఏర్పరచడమే, ‘అష్టదిగ్బంధనం’. సాధారణంగా ఒక ప్రదేశానికి రక్షణ ఏర్పాటు చేయడానికి, రత్నాధ్యాయ క్రియను వినియోగిస్తారు. అంటే, ఎనిమిది దిక్కులలో ఎనిమిది గ్రహాలకు చెందిన జాతి రత్నాలను, కొన్ని ప్రత్యేకమైన మంత్రాలను పఠిస్తూ భూమిలో నిక్షిప్తం చేస్తారు. తద్వారా ఆ రత్నాలు Receivers లా పనిచేస్తూ, అంతరీక్షంలోని ఆ రత్నాలకు చెందిన గ్రహాల యొక్క శక్తిని ఆకర్షించి, ఆ ప్రదేశాన్ని చెడునుంచి రక్షిస్తూ, నిత్యం ఉత్కృష్టమైన Positive Energy ని ప్రసరింపజేస్తుంటాయి. అటువంటిది, సాక్షాత్తూ ఆ దిక్పాలకులే దిగివచ్చి, అరుణాచలేశ్వరుడి చుట్టూ వారి వారి స్థానాలలో ప్రతిష్ఠితమైన అరుణాచల క్షేత్రం గురించి ఇక వేరే చెప్పాలా! అంతటి అరుణాచలేశ్వరుడి విశిష్ఠతను వివరిస్తూ, గతంలో చేసిన వీడియోను కూడా తప్పక చూడండి....