Posts

Showing posts with the label Aurangzeb

Aurangzeb: The Man and the Myth | ఔరంగ్ జేబ్!

Image
  ఔరంగ్ జేబ్! మన పాఠ్య పుస్తకాలు తెలియజేయని, నివురుగప్పిన నిప్పువంటి వాస్తవాలను కొంతకాలమే దాయగలరు! భూమి అట్టడుగు పొరల్లో దాగున్న శిలాద్రవంలా అసలైన చరిత్ర కూడా ఎప్పుడో ఒకప్పుడు బయటకు తన్నుకు రాకమానదు! ధూర్తులు ఎంత అణచిపెట్టే ప్రయత్నం చేసినా, ఇది ఎప్పుడో ఒకప్పుడు, ఏదో ఒక విధంగా జరిగి తీరుతుంది. సాధారణంగా మన ఛానల్ లో ఇంతవరకూ, బయటి ప్రపంచానికి పెద్దగా తెలియని చారిత్రక గాధలూ, కావాలని కుహనా మేధావులు దాచిన హైందవ వీరుల అపురూప చరిత్ర, ఒకప్పుడు అఖండ భారతవనిని ఏలిన గొప్ప చక్రవర్తుల అపూర్వ గాధల గురించి మాత్రమే చెప్పుకున్నాము. మంచితో పాటు, చెడు గురించిన అవగాహన కూడా భావితరాలకు కల్పించాలన్న సదుద్దేశ్యంతో ఈసారి మాత్రం, ఒక హిందూ ద్వేషి, పరమ కిరాతకుడు, నరరూప రాక్షసుడి జీవితం, హైందవ ఆలయాలను ధ్వంసం చేయడమే పరమావధిగా పెట్టుకున్న ఒక నీచుడి గుట్టు, కోట్లాదిమంది ఆమాయక హిందువుల జీవితాలను మత మార్పిడి పేరుతో కాలరాసిన నరహంతకుడి కుతంత్ర భాగోతం గురించిన వాస్తవాలను తెలుసుకుందాము. అతనెవరో కాదు, ఆఖరి మొఘల్ చక్రవర్తి, పరమ హిందూ ద్వేషిగా పేరు పొందిన Aurangzeb. అసలు Aurangzeb ఎవరు..? అతనికీ మనవారికీ యుద్ధం ఎలా జరిగింద...