Posts

Showing posts with the label Birth and Death

Death: A Curse or a Blessing? | మనిషికి మృత్యువు ఎందుకు అవసరం?

Image
మరణం! మనిషికి మృత్యువు ఎందుకు అవసరం? ఆత్మ నిరంతర ప్రయాణంలో ఒక చిన్న మజిలీ అయిన ఈ జీవితాన్ని ఎలా మలుచుకోవాలి? 'చిరంజీవత్వం' అన్నది సాధారణ విషయం కాకపోయినా, సాధ్యమే. ఎందరో మహనీయులు దానిని సాధించారు కూడా. ఎవరైతే మూల చైతన్యాన్ని గురించి సంపూర్ణంగా తెలుసుకుని, ఆ ‘మూలధనం’ లో వృద్ధి చెందుతూ వుంటారో, వారు అకల్పాంతం వరకూ, అంటే, ఎల్లప్పటికీ ‘పిన్న వయస్కులు’ గానే ఈ లోకంలో ఉండగలరు. ఈ విధంగానే అంజనేయస్వామి గానీ, మహావతార్ బాబాజీ కానీ, ఇంకా ఎంతో మంది యోగులు, ‘చిరంజీవులు’ గా ఇప్పటికీ భూమిపై నడయాడుతూ ఉన్నారు. అందరూ మరణాన్ని గురించి భయపడటం సహజమే. కానీ, జనన మరణాలు సృష్టి నియమాలు. ఈ రెండూ విశ్వం యొక్క సమతౌల్యతను కాపాడటానికి అత్యవసరం. లేకపోతే, మనుషులు ఒకరినొకరు అధిగమించే ప్రయత్నంలో, సృష్టి అల్లకల్లోలమవుతుంది. అది ఎలా..? అనే సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి, మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను.. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/LrkjH4viRsU ] మూల చైతన్యాన్ని తెలుసుకోలేని మానవుడు, సృష్టిలో అనివార్యమైన మరణాన్ని గురించి భీతి...

జన్మ - విముక్తి Birth and Death

Image
ఎందుకీ జన్మ? ఎప్పుడు విముక్తి? జీవితం మీద విరక్తి కలిగినప్పుడు, ‘ఛీ.. ఎందుకీ జన్మ?’ అని మనలో మనం ఆక్రోశించుకుంటూ ఉంటాము. అసలు మనిషి జన్మ ఏమిటి? దీనికి విముక్తి ఎప్పుడనే విషయాలను తెలుసుకోవాలనుకున్న వారు ముందుకు సాగండి.. [ మరణించిన తరువాత కర్ణుడు తిరిగి భూమిపైకి ఎందుకు పంపబడ్డాడు?: https://youtu.be/vfBBesZcTbw?si=FoJjN6HAcHW4cOKK ] నిజంగా మానవ జన్మ అంత నీచ నికృష్టమైనదా? అసలు మనం ఈ భూమిమీద ఎందుకు పుట్టము? ఎందుకు చనిపోతున్నాము? చనిపోయాక ఎక్కడికి పోతాము? ఇలాంటి ప్రశ్నలన్నీ మనిషికి సర్వ సాధారణంగా కలుగుతుంటాయి. మనం అనుకున్నట్లుగా మనిషి జన్మ నీచమైనది కాదు.. ఉత్తమోత్తమమైనది.. ‘పునరపి జననం, పునరపి మరణం’ అన్నారు పెద్దలు. జన్మ అంటే మళ్లీ పుట్టడం. అంటే, చనిపోయిన వారు మళ్ళీ పుట్టడమే జన్మ. కానీ, తిరిగి మానవ జన్మే వస్తుందని మాత్రం చెప్పలేము. ఎందుకంటే, మనం ఎలాంటి జన్మ ఎత్తాలో మనం సంపాదించుకున్న జ్ఞానం మీదా, తద్వారా కర్మల మీదా మాత్రమే ఆధారపడి ఉంటుంది. కర్మ ఫలాలను బట్టే మనిషి జన్మ ఉంటుంది. మనిషి జన్మ అనేది, మనం దేవుడికి చేరువ కావడానికి మనకు దొరికిన ఓ అపురూపమైన అవకాశం. భక్తి మార్గంలో ఉండి, వైరాగ్యం చెంది...