గోలోకం గురించి చాలామందికి తెలియని వాస్తవాలు! Cows and Goloka
గోలోకం గురించి చాలామందికి తెలియని వాస్తవాలు! శివుడి ఆగ్రహానికి గురైన కపిల గోవుకు ఎందుకంత ప్రాశస్త్యం? ప్రాచీన భారతీయ సంస్కృతీ సంపదలకు ప్రతీక, పవిత్ర గోమాత. భారతీయులకు అనాది నుంచీ ఆరాధ్య దేవత. చతుర్వేదాలలోనే కాక, హిందూ ధర్మశాస్త్ర గ్రంథాలలోనూ, భారత, రామాయణ భాగవతాది పవిత్రగ్రంథాలలోనూ, గోమహిమ అసామాన్యమైనదిగా అభివర్ణించబడింది. శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా గోమాతను పూజించి సేవించి, గోపాలుడిగా, వాటి ప్రాముఖ్యతను వివరించాడు. దేవతలతో సరిసమాన కీర్తిని గడించిన గోవు ఎలా ఉద్భవించింది? గోవులలో కపిల గోవుకు ఎందుకంత ప్రాముఖ్యత సంతరించుకుంది? అన్ని లోకాలలో కెల్లా గోలోకానికి అంత ప్రాశస్త్యం రావడానికి కారణమేంటి? అసలు మహాభారతంలో, గోవు విశిష్ఠత గురించి ఏం వివరించబడి ఉంది - వంటి ఆసక్తికర అంశాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము.. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/iT2XRwhIgLQ ] పూర్వము విశ్వకర్మ, గొప్ప తపస్సుకు పూనుకున్నాడు. అమృత రూపిణి, కామరూపి అయిన సురభి అనే కన్యను, మానస పుత్రికగా సృష్టించాడు. ఆమెతో పాటు, మహా తేజోవంతుడైన ఒక పురుషుడిని కూడా సృష్టించాడు. ఆ పురుషుడు, ఆ కన్యను చూసి మోహించి, ఆమె...