Posts

Showing posts with the label Desire

ఆశ - Desire

Image
ఆశ - Desire   శ్లోకం : ఆశాయాః యే దాసాః తే దాసాః సర్వలోకస్య । ఆశా యేషాం దాసీ తేషాం దాసాయతే లోకః ॥ యే ఆశాయాః దాసాః తే సర్వలోకస్య దాసాః (భవన్తి)। యేషాం ఆశా దాసీ, లోకః తేషాం దాసాయతే ॥ భావం: ఆశకి ఎవరైతే దాసులో, వారు సమస్త లోకానికీ దాసులు. ఆశ ఎవరికైతే దాసురాలో, అటువంటి వారికి సమస్త లోకమూ దాసత్వం చేస్తుంది. Those who are the slaves of ‘desire’ are slaves of the entire world. But world itself is the slave of those, to whom ‘desire’ is a slave. ఆశ మనిషికి సహజం. అదే ఆశ మితిమీరితే, అత్యాశ లేక దురాశ అవుతుంది. స్థూలంగా దీనినే ఆశ అంటూ ఉంటారు.  ఈ ఆశే, మనిషిని తన బానిసను చేసుకుంటుంది. ధన వ్యామోహము ఒక ఆశ. విపరీతమైన ధన వ్యామోహము, లేదా దానిమీద విపరీతమైన కోరిక లేక మమకారం, అనేకమైన విపరీతాలకు దారి తీస్తుంది. విపరీత ధనకాంక్షతో మనిషి ఉచ్ఛనీచాలు కూడా మరచిపోయి, ఎంతటి ఘాతుకానికైనా ఒడిగడతాడు. మద్యపానమూ, జూదమూ, వ్యభిచారమూ, చౌర్యమూ, మాదక ద్రవ్య సేవనమూ, హత్యలూ, మాన భంగాలూ, ఇవన్నీ తీవ్రమైన కోరికల పర్యవసానములు. అవే వ్యసనాలుగా పరిణమిస్తాయి. ఇటువంటి కోరికలకు ఎవరైతే దాసులో, వారు ప్రపంచానికే దాసులు. వారి ప్రవర్తన...