దృష్టికి పెట్టుకునే రాగి యంత్రాలు Drishti Yantras
దృష్టికి పెట్టుకునే రాగి యంత్రాలు పూజ గదిలో పెట్టుకోవచ్చా? అసలు రాగి యంత్రాల వల్ల ప్రయోజనం ఉందా? ఇది చదివితే మీకే అర్ధం అవుతుంది.. మనిషి ఉదయం లేచినప్పటి నుంచి, రాత్రి పడుకునేంత వరకు, ఎన్నో పనులు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో, ఇతరులు మనల్ని చూసో, మన ఇంటిని చూసో, ఈర్ష్య చెందుతుంటారు. దాని వల్ల, మనకు తెలియకుండానే దృష్టి ప్రభావం ఇంటిపై పడటం వల్ల, ఆ ఇంట్లోని వారు ఎన్నో సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అందువల్ల, ఆ దృష్టి ప్రభావం నుంచి తప్పించుకోవడానికి, ఇంటికి బూడిద గుమ్మడికాయను కట్టడం, ఇంటికి దృష్టి తీయయడం వంటి కొన్ని పరిహారాల గురించి, ధర్మ సందేహాలలో స్పష్టంగా చెప్పబడింది. అయితే, మనలో చాలా మంది, దృష్టి పోడానికి కొన్ని రాగి రేకు యంత్రాలను సైతం తెచ్చుకుని, ఇంటి ముందు కట్టుకుంటారు. కానీ మరికొంతమంది, వాటిని దేవుడి గదిలో కూడా పెట్టుకోవడం చూస్తుంటాము. ఆ రాగి రేకులను పూజ గదిలో పెట్టుకోవచ్చా, లేదా? రాగి రేకుల వల్ల దృష్టి నిజంగా పోతుందా? దృష్టిని తొలగించే యంత్రాలను, దేవుడి గదిలో ఎందుకు పెట్టమని చెబుతున్నారు? వంటి సందేహాలు ఎన్నో, మనలో చాలా మందికి కలగకమానవు. అటువంటి సందేహాలకు సమాధానాలు తెలియయాలంటే, ఈ శీర్షికన...