MIND-BLOWING Secrets of HELL (Narakam) Punishments Revealed నరకము - శిక్షలు!

నరకము - శిక్షలు! TELUGU VOICE ఇక్కడే మనం ఇన్ని బాధలు పడుతున్నప్పుడు మళ్ళీ నరకము, శిక్షలు అవసరమా? దైవం కరుణాసముద్రుడు. సకల ప్రాణికోటికీ ఆయన సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని ప్రసాదించాడు. తాననుకున్న పనులను చేసుకుంటూనే సచ్చిదానందాన్ని పొందవచ్చు. ఎవరు ఎన్ని తప్పులు చేసినా, ఆ పరమేశ్వరుడు కోపగించుకోడు, ద్వేషంతో దండించడు. కానీ, ఆయన రచించిన వ్యవస్థలో, జీవులు తమ తప్పులకు తగిన దండనను అనుభవించ వలసి రావటం అనేది, భవిష్యత్తులో మనం ఎక్కువ యోగ్యతను పొందటం కోసమే. స్వర్గ నరకాల వ్యవస్థ ఈ దృష్టికోణంతో రచింప బడినదే. మృత్యువు తరువాత వెంటనే మరో దేహం ధరించటం వీలుకాదు. నూతన దేహ ప్రాప్తికి ముందు జీవి, మనోమయ, ప్రాణమయ దేహం చేత, సుకృత, దుష్కృత, సుఖ దుఃఖాల ఫలితాలను అనుభవించవలసి ఉంటుంది. గరుడ పురాణంలో, కఠోపనిషత్తు వంటి గ్రంధాలలో చెప్పబడిన వివరణతో, గతంలో మనం కొన్ని వీడియోలు చేసి ఉన్నాము. చూడని వారు అవి కూడా చూస్తే మరికొంత అవగాహన వస్తుంది. ఇక వాస్తవంగా స్వర్గ నరకాలేమిటి, అక్కడి శిక్షలు, భోగాల వంటి విషయాలు తెలుసుకోవడం కోసం, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను.....