గరుడ పురాణం ప్రకారం ‘ప్రేతాత్మలు’! Garuda Purana - Ghosts
గరుడ పురాణం ప్రకారం ‘ప్రేతాత్మలు’! ప్రేతాత్మలు మనకు ఏం చెబుతాయి? ఎలా తెలియబరుస్తాయి? మనలో ప్రతి ఒక్కరికీ సంబంధించిన విషయం, ‘ప్రేతాత్మలు’. ఏ కారణం లేకుండా జ్వరం వచ్చి తగ్గలేదంటే, గాలి శోకిందని భావిస్తాము. ఒక కుంటుంబంలో ఎవరైనా చనిపోయిన తరువాత ఆ ఇంట్లో కీడు జరిగిందంటే, ప్రేతాత్మే కారణమని, పరిహారాలు చూసుకుంటాం. ఈ ప్రేత్మాతల గురించి, శ్రీ మహా గరుడ పురాణం, ధర్మకాండలో, గరుడుడు, విష్ణుమూర్తిని అడుగగా, అందుకు భగవానుడే స్వయంగా సమాధానాలిచ్చాడు. ఎలాంటి మరణాలు పొందిన వారు ప్రేతాత్మలవుతారు? ఎటువంటి వారిని ప్రేతాత్మలు ఆవహిస్తాయి? ప్రేతాత్మల వలన మనకు ఎటువంటి కీడు కలిగే అవకాశం ఉంది? ప్రేతం ఆవహించిన వారు ఎటువంటి చర్యలకు పాల్పడతారు? ప్రేతాల బారి నుండి తప్పించుకోవాలంటే ఏం చేయలి? వంటి ముఖ్య విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము.. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/dZKCW8TLpHw ] బ్రహ్మాండాధి నాయకుడిని గరుడుడు ఇలా అడుగుతున్నాడు.. ‘అసలు ఈ ప్రేతాల ఉత్పత్తి ఎలా జరుగుతుంది? అవి ఎలా తిరుగుతాయి? వాటి రూపురేఖలు భోజనాదులు ఎలా ఉంటాయి? అవెక్కడుంటాయి? వాటిని ప్రసన్నం చేసుకోవడం ఎలా? ప్రసన్న చిత్తుడ...