కపట సన్యాసి - మహారాజు! ప్రతీ ఒక్కరూ తెలుసుకోవలసిన కథ! Greed Is The Blindfold That Blocks Your Mind!
కపట సన్యాసి - మహారాజు! ప్రతీ ఒక్కరూ తెలుసుకోవలసిన కథ! రావణుని జన్మకు కారణం, ఆ లక్ష మంది విప్రుల శాపమా? సమస్త భూమండలానికీ ఎలిక అయిన కైకయ రాజు ప్రతాపభానుడు, సద్గుణ సంపన్నుడూ, గొప్పయోధుడు. అతని ప్రియ సోదరుడైన అరిమర్దనుడు మహా బలశాలి, వీరుడు. ప్రతాపభానుని మంత్రి ధర్మరుచి. అతడు నీతిజ్ఞుడు, బుద్ధిమంతుడు. తన దిగ్విజయ యాత్రలో, ఆ రాజు సప్తద్వీపాలనూ జయించి, సమస్త భూమండలానికీ ఏకైకచక్రవర్తి అయ్యాడు. మంత్రి అయిన ధర్మరుచి ప్రభావమువలన, ఆ రాజు గురువులనూ, దేవతలనూ, సాధు సజ్జనులనూ, పితరులనూ, భూసురులనూ, భక్తి విశ్వాసాలతో సేవించేవాడు. రాజ ధర్మాలను వేదోక్తంగా పాటిస్తూ, నిత్యం అనేక దాన ధర్మాలు చేసేవాడు. పురాణేతిహాసాలను భక్తి శ్రద్ధలతో వినేవాడు. ఎన్నో బావులూ, చెఱువులూ, ఉద్యానవనాలూ, దేవతా మందిరాలూ కట్టించి, ప్రజా రంజకంగా రాజ్యపాలన చేశాడు. వనాలలో ఆశ్రమాలను నిర్మించుకున్న మహర్షులు, తమ తపశ్శక్తిలో ఆరవ భాగం రాజులకు ధార పోస్తారు. ఆ శక్తితో రాజులు ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తుంటారు. అందుకే, లోకహితులైన మహర్షులను క్రూరమృగాలనుండి కాపాడటం, రాజుల విధి. మునుల కార్యార్థం అడవికి వెళ్ళిన మహారాజు, ఒక కపట సన్యాసి వలన ఏ విధం...