హరిహర 108 నామాలు.. యమధర్మరాజ కృతం.. Harihara Ashtottara Shatanama Stotram
హరిహర 108 నామాలు.. యమధర్మరాజ కృతం.. హరిహర అష్టోత్తర శతనామ స్తోత్రమ్ - Harihara Ashtottara Shatanama Stotram 108 శివకేశవుల నామాలు జీవితంలో ఒక్కసారైనా పఠిస్తే, యమధర్మరాజు నుంచి విముక్తి లభిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. అదీ ముఖ్యంగా వారణాసికి వెళ్లినప్పుడు, మణికర్ణిక తీర్థం వద్ద శివకేశవులను 108 నామాలతో స్తుతించిన వారికి ఇక నరక బాధలంటూ ఉండవని వారు సూచిస్తున్నారు. ముఖ్యంగా కార్తీక మాసంలో శివకేశవులను స్తుతించడం మాత్రమే చేయాలి. గోవిన్ద మాధవ ముకున్ద హరే మురారే శంభో శివేశ శశిశేఖర శూలపాణే || దామోదరాచ్యుత జనార్దన వాసుదేవ త్యాజ్యా భటా య ఇతి సన్తతమామనన్తి ||౧|| గఙ్గాధరాన్ధకరిపో హర నీలకణ్ఠ వైకుణ్ఠ కైటభరిపో కమఠాబ్జపాణే|| భుతేశ ఖణ్డపరశో మృడ చణ్డికేశ త్యాజ్యా భటా య ఇతి సన్తతమామనన్తి ||౨ || విష్ణో నృసింహ మధుసూదన చక్రపాణే గౌరీపతే గిరిశ శఙ్కర చన్ద్రచూడ || నారాయణాసురనిబర్హణ శార్ఙ్గపాణే త్యాజ్యా భటా య ఇతి సన్తతమామనన్తి ||౩|| మృత్యుఞ్జయోగ్ర విషమేక్షణ కామశత్రో శ్రీకాన్త పీతవసనాంబుద నీల శౌరే || ఈశాన కృత్తివసన త్రిదశైకనాథ త్యాజ్యా భటా య ఇతి సన్తతమామనన్తి ||౪|| లక్ష్మీపతే మధురిపో పురుషోత్తమాద్య శ...