కర్మ ఫల త్యాగి - భగవద్గీత | Bhagavad Gita - Karma Phala Tyagi

కర్మఫలత్యాగి! శరీరధారులకు పూర్తిగా ఎటువంటి కర్మలూ చేయకుండా ఉండటం సాధ్యమా? 'భగవద్గీత' అష్టాదశోధ్యాయం - మోక్ష సన్యాస యోగం (11 – 16 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పద్దెనిమిదవ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము. ఈ రోజుటి మన వీడియోలో, మోక్ష సన్యాస యోగములోని, 11 నుండి 16 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము.. [ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/7ccCqvQVC90 ] నిజమైన త్యాగి వేటిని త్యజించాలో చూద్దాం.. 00:45 - న హి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః । యస్తు కర్మఫలత్యాగీ స త్యాగీత్యభిధీయతే ।। 11 ।। దేహమును కలిగీ ఉన్న ఏ జీవికి కూడా, కర్మలను పూర్తిగా త్యజించటం శక్యము కాదు. అందుకే తన కర్మ ఫలములను త్యజించినవాడే, నిజమైన త్యాగి అని చెప్పబడును. కర్మ ఫలములను త్యజించటం కన్నా, అసలు కర్మలనే పూర్తిగా త్యజించటమే మేలు కదా! అని కొందరు వాదించవచ్చు. దానితో ఇక ధ్యానమునకూ, మరియు ఆధ్యాత్మిక చింతనకూ ఎలాంటి అవరోధమూ ఉండదని అనుకోవచ్చు. శ్రీ కృష్ణుడు అది ఆచరణకు సాధ్యంకానిదని తిరస్కరిస్తు...