Posts

Showing posts with the label Kathopanishad Death Indic

కఠోపనిషత్తు! Significance of Kathopanishad

Image
కఠోపనిషత్తు! ఎందుకంత ముఖ్యం? ‘యమధర్మరాజు’ సూటిగా, సందేహాలకు తావు లేకుండా చెప్పిన విషయాలేంటి? సమస్త మానవాళికీ, వారి వారి స్థాయిలలో ఉద్ధరింప బడటానికి మార్గాలను చూపేవి, ‘వేదాలు’. పరిపక్వం చెందిన సాధకులకూ, వైరాగ్య భావనగల వారికీ, మోక్షంకోసం తపించేవారికీ చక్కగా ఉపకరించేవి, ‘ఉపనిషత్తులు’. ‘ఉపనిషత్తు’ అనే శబ్దం వినిపించగానే, ఎవరిలో అయితే ఒక పారవశ్యం, పులకరింత కలుగుతాయో, వారే ఉపనిషత్తులలోని జ్ఞానాన్ని గ్రహించగల బుద్ధిని కలిగి వుంటారు. ఉపనిషత్తు అంటే, అజ్ఞానాన్ని పూర్తిగా నశింపజేసేదని ఒక అర్థమయితే, వైరాగ్యవంతుడైన సాధకుని, పరమాత్మ సన్నిధికి చేర్చి, ఆ పరమాత్మతో ఐక్యత కలిగించేదే ఉపనిషత్తని, మరొక అర్థం. నాలుగు వేదాలలోనూ ‘జ్ఞాన భాండాగారాలు’ అనదగిన ఉపనిషత్తులు, 1180 ఉన్నాయి. అయినా ఇప్పుడు అన్ని పేర్లూ లభించడం లేదు. ముక్తికోపనిషత్తులో, శ్రీరాముడు ఆంజనేయునికి, 108 ఉపనిషత్తుల పేర్లను తెలియజేయడం జరిగింది. అందులో 10 ఉపనిషత్తులను, అత్యంత ప్రధానమైనవిగా భావించి, ముగ్గురు ఆచార్యులు వాటికి భాష్యాలు వ్రాశారు. అవే, దశోపనిషత్తులుగా ప్రఖ్యాతిగాంచాయి. ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముండక, మాండూక్య, ఐతరేయ, తైత్తిరీయ, ఛాందోగ్య,...

Kathopanishad Death Indic | మరణం నుండి మరుజన్మ దాకా! ..వాస్తవాలు

Image
మరణం నుండి మరుజన్మ దాకా! ..వాస్తవాలు మనం పుట్టింది ఎందుకు? చేస్తున్నదేమిటి? అసలు చేయాల్సిందేమిటి? పుట్టిన ప్రతి జీవీ ఏదో ఒక రోజు మరణించక తప్పదు. భగవంతుడు నిర్ణయించిన జనన మరణ చక్రంలో, ఆత్మ నిరంతర ప్రయాణం అనివార్యం. ఇది ఎవ్వరూ విస్మరించకూడని సత్యం. మన పురాణాల ప్రకారం, మరణించిన వ్యక్తి ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో, తన శరీరాన్నీ, కుటుంబ సభ్యులనూ చూసి విచారిస్తుంది. ఆ తరువాత ఇహలోక బంధాలను వీడి, తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. మరణించిన తర్వాత ఆత్మలు మళ్ళీ మరో జన్మ తీసుకునే దాకా, ఒక్కోసారి ఈ క్రమంలో, కొన్ని వందల సంవత్సరాల తరువాత మళ్ళీ జన్మనెత్తుతాయి. మరి అటువంటి ఆత్మలు ఆ సమయంలో ఏం చేస్తాయి, ఎక్కడ ఉంటాయి? అనేది, చాలా మందికి కలిగే సందేహం! ఇటువంటి విషయాలు కొంత భయాన్ని కలిగించడం సహజమే.. కానీ, ఇటువంటి విషయాలే, మన జీవితాలను స్వార్ధపూరితం కాకుండా కాపాడి, సన్మార్గంలో నడిపించడానికి దోహద పడతాయి. ఈ మధ్య కొంతమంది టైటిల్ ను మాత్రమే చూసి కామెంట్ చేయడం, చిన్న చిన్న పొరపట్లను ఎత్తి చూపడం గమనించాను. దీని వలన అందరూ సన్మార్గ జీవనాన్ని అవలంభించాలనే సదుద్దేశం మరుగునపడి, నా ప్రయాస వ్యర్ధమైపోతుంది. అందరికీ మనస...