శ్రీ కృష్ణుడి చిట్టచివరి ప్రసంగం! Last Message of Krishna on the day he left his body
శ్రీ కృష్ణుడి చిట్టచివరి ప్రసంగం!? కృష్ణుడు తనువు చాలించే ముందు చెప్పిన ఆఖరి మాటలేంటి? కడలి లోతులను గుర్తుకు తెచ్చేటంతటి చరిత్రగల మహాభారత గాధలలో, నేటికీ మనలో చాలా మందికి తెలియని ఎన్నో విషయాలు నిబిడీకృతమై వున్నాయి. అటువంటి వాటిలో ఒకటి, ఆ శ్రీకృష్ణ పరంధాముడు చెప్పిన చివరి మాటలు. ఆ స్వామి అవతార పరిసమాప్తికి ముందు చెప్పిన కొన్ని విషయాలు, ఆశ్చర్యం కలిగించక మానవు. ఇది ఆయన చిట్టచివరి ప్రసంగం. దీని తర్వాత ఇక ఆయన మాట్లాడ లేదు. ఇది లోకాన్ని ఉద్ధరించడానికి ఉద్ధవుడిని అడ్డుపెట్టి చెప్పారు. ఇంతకీ శ్రీకృష్ణ పరంధాముడు చెప్పిన ఆ చివరి పలుకులేంటి? చాలామందికి తెలియని ఆ విషయాలకోసం, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను.. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/IkX39QAjEJw ] ‘ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే’ అని చెప్పినట్లుగా, సాక్షాత్తు ఆ శ్రీ మహా విష్ణువే దిగివచ్చి, ద్వాపర యుగంలో కృష్ణావతారాన్ని ఎత్తిన విషయం తెలిసిందే. మానవ జన్మ అయినప్పటికీ, పుట్టినప్పటి నుంచీ ఒక పక్క ఎన్నో మహిమలను చూపుతూ, మరోపక్క అందరితో కలివిడిగా త...