దేవుడి పటాల వెనుక బల్లి తిరుగుతుంటే ఏం జరుగుతుంది? Lizard Shastra
దేవుడి పటాల వెనుక బల్లి తిరుగుతుంటే ఏం జరుగుతుంది? భగవంతుడు ఈ భూమిపై తిరిగే ప్రతి జీవికీ ఓ శక్తిని ఇచ్చాడని, శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే మనం ప్రతి జీవినీ గౌరవించాలనీ, ప్రతి జీవికీ మేలు జరిగే పనులు చేయాలనీ, మన ధర్మ శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే, మన చుట్టూ ఉండే జీవులలో కొన్ని మాత్రం కాస్త ప్రత్యేకమైనవిగా పండితులు చెబుతున్నారు. అటువంటి జీవులలో, బల్లి ఒకటి. మన ఇళ్ళలో ఎక్కువగా కనిపించే ఈ బల్లుల విషయంలో, మనకు ఎన్నో భయాలూ, అనుమానాలూ ఉంటాయి. అటువంటి అనుమానాలలో, ఇంట్లో ఉన్న దేవుడి మందిరంలోకీ, దేవుడి పటాల మధ్యకీ బల్లులు రావచ్చా? అనేది ఒకటి. ఒకవేళ దేవుడి పటాల మధ్యలోకి బల్లులు వస్తే, మంచి జరుగుతుందా? చెడు జరుగుతుందా? అని ఎంతో మంది సందేహపడుతుంటారు. ఆ విషయాలు స్పష్టంగా తెలుసుకోడానికి, ఈ శీర్షికను పూర్తిగా చదవండి. మన హైందవ ధర్మం ప్రకారం, బల్లికి కొన్ని శక్తులు ఉన్నాయనీ, దాని ప్రకారం అవి మనిషి జీవితంలో జరగబోయే విషయాలను ముందుగానే తెలియచేస్తాయనీ, ఎంతో స్పష్టంగా చెప్పబడి ఉంది. అందుకోసం మన ధర్మంలో, ఈ సృష్టిలో మరే ప్రాణికీ లేని విధంగా, ఏకంగా బల్లి శాస్త్రం అని ఓ శాస్త్రమే ఉంది. అటువంటి బల్లిని మ...