మహాలయ పక్షాలు 2024 Mahalay Paksh - Pitru Paksh

ఈ రోజు 'సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2' వరకు, 'మహాలయ పక్షాలు'.. TELUGU VOICE - అంటే ఏమిటి? ఏం చేయాలి? మనిషి ఎంతగా ఎదిగినా, ఎంత దూరం పయనించినా, తన మూలాలను మరచి పోకూడదు. ఆ మూలాలే అతని జన్మకీ, అతని సంస్కారానికీ, సంస్కృతికీ కారణం. అందుకే, ప్రతి ఏటా ఏదో ఒక సమయంలో మన పెద్దలను తలుచుకునేందుకు కొన్ని సందర్భాలను ఏర్పరిచారు మన పూర్వీకులు. వాటిలో ముఖ్యమైనవి, మహాలయపక్షం రోజులు. చనిపోయినవారి ఆత్మలు తిరిగి జన్మించాలంటే, అన్నాన్ని ఆశ్రయించే తల్లి గర్భంలోకి ప్రవేశిస్తుందని శాస్త్రం చెబుతోంది. శ్రాద్ధకర్మలు సరిగ్గా నిర్వహించకపోతే, మనిషి ప్రేత రూపంలో సంచరిస్తూనే ఉంటాడని నమ్మకం. ఈ రెండు వాదనలూ నమ్మకపోయినా, పూర్వీకులను తలుచుకోవడం అనే సంస్కారాన్ని మాత్రం కాదనలేము కదా! అందుకు ఓ సందర్భమే మహాలయ పక్షాలు. భ్రాద్రపద బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకూ వచ్చే 15 రోజుల కాలాన్ని, 'మహాలయ పక్ష'మని అంటారు. మహాలయ పక్షంలో పితృదేవతలకు తర్పణాలు విడుస్తాము కాబట్టి, దీనిని పితృ పక్షమని కూడా అంటారు. ఇప్పటి వరకూ మనం పితృ దేవతలకు చేస్తున్న శ్రాద్ధకర్మలలో ఎలాంటి లోపం వచ్చినా కూడా, ఈ పక్షంలో తర్పణాలని విడిస్త...