Posts

Showing posts with the label Main Door Gadapa

గడప విషయంలో ఇవి పాటిస్తే, అదృష్టం మీ వెంటే ఉంటుంది! Main Door Gadapa

Image
గడప విషయంలో ఇవి పాటిస్తే, అదృష్టం మీ వెంటే ఉంటుంది! ఇల్లే సకల సౌఖ్యలనూ, అష్టైశ్వర్యాలనూ, ఆయురారోగ్యాలనూ ప్రసాదించే దివ్యమైన ప్రదేశమని మన పెద్దలు చెబుతుంటారు. అందువల్ల, ఇంట్లో మనం చేసే పనులే, మన జీవితాన్ని నిర్ణయిస్తాయని, శాస్త్ర వచనం. అందులోనూ, ఇంటి నుంచి బయటి శక్తులను దూరంగా ఉంచి, మనల్ని ఎల్ల వేళలా కాపాడే గడపకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మన ధర్మం ప్రకారం, గడపను సాక్ష్యత్తు లక్ష్మీ స్వరూపంగా చూస్తాము. అదువల్ల, ఆ గడప దగ్గర చేయాల్సిన, చేయకూడని పనులు కొన్ని ఉన్నాయనీ, వాటిని తెలుసుకుంటే, ఆ లక్ష్మీ మాత అనుగ్రహం మన వెంటే ఉంటుందనీ, పండితుల మాట. మన పురాణాలలో, వేదాలలో, శాస్త్రాలలో, గడపకు ఎంతో విశేషమైన స్థానం కల్పించబడింది. అందువల్ల, గడప విషయంలో కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించి తీరాలని కూడా, చెప్పబడి ఉంది. ఆ విధంగా చెప్పిన వాటిలో, గడప దగ్గర పాల ప్యాకెట్లను పెట్టం. మనలో చాలా మంది, పాల ప్యాకెట్లను వేయించుకుంటూ ఉంటాము. ఆ పాల ప్యాకెట్లు డెలివర్ చేసేవారు, వాటిని గడపపై కానీ, గడప ముందు నేలపై కానీ పెట్టి వెళ్లిపోతారు. ఆ విధంగా అస్సలు చేయకూడదు. ఇక్కడ పాలు కూడా లక్ష్మీ సమానం కాబట్టి, వాటిని కింద పెడితే మంచిది...