Posts

Showing posts with the label Nagula Chavithi

నాగుల చవితి 2024 Nagula Chavithi

Image
అందరికీ ' నాగుల చవితి ' శుభాకాంక్షలు 🙏   TELUGU VOICE 'కాల నాగు' మానవ శరీరంలో నిద్రిస్తున్నట్లు నటిస్తూ, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాలను గ్రక్కుతూ, మానవునిలో 'సత్వగుణ' సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందనీ, అందుకు నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్ప పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే, మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది, అందరి హృదయాలలో నివసించే 'శ్రీమహావిష్ణువు'కు తెల్లని ఆదిశేషువుగా మారి, శేషపాన్పుగా మారాలనే కోరికతో చేసేదే, ఈ పాము పుట్టలో పాలు పోయడంలో గల ఆంతర్యమని కొంత మంది పెద్దల మాటల ద్వారా తెలుస్తుంది. పాలు స్వచ్ఛతకు ప్రతీక. ఈ పాలను వేడి చేసి చల్లపరచి, దానికి కొద్దిగా చల్లను చేరిస్తే పెరుగవుతుంది. ఆ పెరుగును చిలుకగా వచ్చిన చల్లలో నుంచి వచ్చే వెన్నను కాయగా, నెయ్యి అవుతుంది. దీనిని మనం యజ్ఞంలో హవిస్సుగా ఉపయోగిస్తాము. అలాగే మన బ్రతుకనే పాలను, జ్ఞానమనే వేడితో కాచి, వివేకమనే చల్ల కలిపితే, సుఖమనే పెరుగు తయారవుతుంది. ఈ పెరుగును ఔదార్యమనే కవ్వంతో చిలుకగా, శాంతి అనే చల్ల లభిస్తుంది. ఆ చల్లను సత్యం, శివం, సుందరం అనే మూడు వేళ్ళతో కాస్త...