విభీషణుడి కుమారుడు ‘నీలుడి కథ’! Purushottama Kshetra / Neeladri
దేవలోకంపై యుద్ధానికి వెళ్ళిన అసురుడు నీలాచలేశ్వరుడిగా వెలిశాడా? చింతామణి, కామధేనువు, కల్ప వక్షం అనేవి, దేవతా వస్తువులు. కానీ, అటువంటి అద్భుత వస్తువులను అసురుడైన నీలుడు సంపాదించుకున్నాడు. విభీషణుడి కుమారుడైన నీలుడు, పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించి వరం సంపాదించి, ఇంద్రుడిపై యుద్ధం చేశాడు. దేవతలపై యుద్ధం చేయడానికి వెళుతున్న నీలుడిని, రామభక్తుడైన విభీషణుడు ఎందుకు అడ్డుకోలేదు? అసురుడైన నీలుడికి గురువైన శుక్రాచార్యుడిచ్చిన సలహా ఏంటి? దేవతా స్త్రీలలోని అత్యంత సుందరీమణి అయిన వన సుందరిని, నీలుడు ఎలా పొందాడు - వంటి ఆసక్తికర విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము.. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/pGLkcLVZvBA ] రావణ వధ తర్వాత, లంకాపూరికి విభీషణుడు పట్టాభిషిక్తుడయ్యాడు. ఆయన ధర్మబద్ధంగా రాజ్య పాలన చేస్తుండేవాడు. విభీషణుడి కొడుకు పేరు నీలుడు. ఇతడు గుణమూ, బలమూ, విద్యలలో మేటి. ఒక సారి నీలుడు, తండ్రి విభీషణుడి దగ్గరకు వెళ్ళి నమస్కరించి, ఇలా అన్నాడు. "తండ్రీ! మీ పరిపాలనలో ప్రజలంతా సుఖ, సంతోషాలతో వర్ధిల్లుతున్నారు. వారికేమీ లోటు లేదు. మనకు ధన సంపదలకు కొదవ కూడా లేదు. అయినా మన రా...