Sabarimala: Original Ayyappa's Idol Vandalised? | శబరిమల అయ్యప్ప! దైవ స్థాపిత విగ్రహం ఏమయ్యింది?
శబరిమల అయ్యప్ప! దైవ స్థాపిత విగ్రహం ఏమయ్యింది! నేడు భక్తులు దర్శించుకునే అయ్యప్ప స్వామి విగ్రహం పరశురాముడు ప్రతిష్ఠించినది కాదా? స్వామియే శరణం అయ్యప్ప అంటూ ప్రపంచం దద్దరిల్లి పోతోంది. ఆ హరిహర సుతుడిపైనున్న నమ్మకం, ప్రేమ, భక్తికి గుర్తుగా, ఆయప్ప మాలను ధరించి, మండలం రోజుల పాటు దీక్షబూనుతుంటారు ప్రతి సంవత్సరం. కార్తీక మాసం మొదలవ్వగానే, మనకు ఎక్కడ చూసినా ఆ మణికంఠుడి మాల ధరించిన స్వాములే కనిపిస్తూ ఉంటారు. ఈ సమయంలో ఆయప్ప మాల వేసుకుని వచ్చే కోట్లాది మంది స్వాములతో కిక్కిరిసి పోయి ఉంటుంది శబరిమల. ప్రతి సంవత్సరం కోట్లాది మంది దర్శించుకునే అయ్యప్ప స్వామి విగ్రహం, ఆనాటి దైవ స్థాపిత విగ్రహమేనా? అసలైన విగ్రహం పళనిలోని కుమారస్వామి ఆలయంలో ఉన్న నవ పాషాణ విగ్రహం లాంటిదా? మరి అసలైన విగ్రహానికి ఏమైంది..? ఇప్పుడున్న విగ్రహం అక్కడికి ఎలా చేరింది..? వంటి అనేక సందేహాలకు సమాధానాలు తెలుసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను.. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/Z1osWZdk17g ] కార్తీక మాసంలోనే కాకుండా, ప్రతి నెల కొన్ని ప్రత్యేక...