హిందూత్వం - 1 - Science and Hinduism
హిందూత్వం - 1 మనం కాలాన్ని ఏ విధంగా కొలుస్తాము?.. భూమి మీద ఒక ప్రామాణిక దూరములోగల బిందువులను తీసుకుని, ఆ రెండు బిందువులనూ, నిర్దేశిత వేగంతో చేరే సమయాన్నీ, కాలాన్నీ, ఒక ప్రమాణంగా తీసుకోవడం జరుగుతుంది. అంతేకదా.. మరి మీరు దూరాన్ని ఏ విధంగా కొలుస్తారు? అని అడిగితే దానికి సమాధానం, ఇంతకు ముందు చెప్పిన విధానాన్నే చెప్పవలసి వస్తుంది. ఏ విధంగా అంటే, ఒక రెండు బిందువులను తీసుకుంటే, మీరు ఒకే సమయంలో, రెండు బిందువుల వద్దా ఉండలేరు గనుక, మొదటి బిందువు నుండి ఒక ప్రామాణిక వేగంతో, ప్రామాణిక కాలంలో, రెండవ బిందువు చేరగలిగితే, దానిని దూరము అంటాం.. ఇలా ఈ రెండూ ఒక దానితో ఒకటి ముడిపడి, ఈ కాలము, విశ్వముతో ఉన్న సంబంధాన్ని మనకు తెలయజేస్తుంది. ఈ విషయాన్ని ఐన్స్టీన్ మహశయుడు సాపేక్షతా సిద్ధాంత రూపంలో తెలియపరిచారు. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/HAU_0e-RybQ ] నిన్న మొన్నటి వరకూ వీదేశీయుల కాలగమనం ప్రకారం, సెకను, నిమిషము, గంట, దినము, వారము, మాసము, ఋతువు, సంవత్సరం మాత్రమే ఉండేవి. సంవత్సరములు, అంటే, కేవలం అంకెలు మాత్రమే .. రశ్మ్యుద్గారకత, ప...