Posts

Showing posts with the label Shocking facts about Bibi Nanchari

ముస్లిం యువతిని శ్రీనివాసుడు పెళ్లాడాడా? Shocking facts about Bibi Nanchari

Image
ముస్లిం యువతిని శ్రీనివాసుడు పెళ్లాడాడా? శ్రీరంగంలో నిత్యం పూజలందుకుంటున్న ముస్లిం యువతి ఎవరు? కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరునికి భార్యలుగా పద్మావతి.. అలిమేలు మంగలతో పాటు, తిరుమలలో తుళుక్క నాచియార్ పేరుతో పూజలందుకుంటున్న ఒక ముస్లిం యువతి గురించి, చాలా మందికి తెలిసే ఉంటుంది. అసలు ఆమె ఎవరు? ముస్లిం యువతి వేంకటేశ్వరుని భార్య ఎలా అయ్యింది? అనేటటువంటి ఆసక్తికర విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము.. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/L-zdTXdLyVs ] శ్రీ వేంకటేశ్వరుడూ, బీబీ నాంచారీల వివాహం మీద, మన దేశంలో పలు కథలు ప్రచారంలో ఉన్నాయి. నాచియార్‌ అనే త‌మిళ ప‌దం నుంచి, నాంచార‌మ్మ అన్న పేరు వ‌చ్చింద‌ని చెబుతారు. నాచియార్ అంటే, భ‌క్తురాలు అని అర్థం. ఇక బీబీ అంటే భార్య అని అర్థం. బీబీ నాంచార‌మ్మ గాథ ఈనాటిది కాదు. క‌నీసం ఏడు వంద‌ల సంవ‌త్సరాల నుంచి, ఈమె క‌థ జ‌న‌ప‌దంలో నిలిచి ఉంది. అయితే, ఆమెకు సంబంధించి ముఖ్యంగా చెప్పుకునే కథలలో, బీబీ నాంచార‌మ్మ, మాలిక్ కాఫిర్ అనే సేనాని కుమార్తె. ఆమె అస‌లు పేరు సుర‌తాని. స్వత‌హాగా హిందువైన మాలిక్ కాఫిర్, అల్లాఉద్దీన్ ఖిల్జీకి సేనానిగా మారి, తాను కూడ...