'8-4-2024' వ తారీకు సోమవారం రోజున, 'సోమావతీ అమావాస్య'.. Somavathi Amavasya 2024
'8-4-2024' వ తారీకు సోమవారం రోజున, 'సోమావతీ అమావాస్య'.. @mplanetleaf అమ్మాయికి, లేక అబ్బాయికి పెళ్లి సంబంధం కుదరడం ఆలస్యం అవుతున్న వారికీ, నిరుద్యోగులైన వారికీ శివుడు అందించిన అద్భుత అవకాశం 'సోమావతీ అమావాస్య'. సోమావతీ అమావాస్య రోజున ఈ చిన్ని పరిహారం చేస్తే, శివానుగ్రహంతో సమస్త శుభములనూ సమకూర్చుకో గలరు.. సోమవతీ అమావాస్య రోజున ఏం చేయాలి? శివుడికి సోమవారం అంటే చాలా ప్రీతికరం అన్న విషయం అందరికీ తెలిసిందే. అమావాస్య కలసి వచ్చే సోమవారమే ‘సోమవతీ అమావాస్య’. దక్షయజ్ఞం కథ అందరికీ తెలిసిందే! తన అల్లుడైన శివుడిని అవమానించేందుకే, దక్షుడు ఆ యజ్ఞాన్ని తలపెట్టాడు. అక్కడ తనకు చోటు లేదని శివుడు వారిస్తున్నా వినకుండా, శివుడి భార్య సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్లింది. సతీదేవి తన కుమార్తె అన్న ఆలోచన కూడా లేకుండా, దక్షుడు ఆమెను కూడా అవమానించాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేని సతీదేవి, తనను తాను దహించివేసుకున్నది. సతీదేవి మరణం గురించి విన్న శివుడు ఆగ్రహోదగ్రుడై, తన వెంట్రుకతో వీరభద్రుని సృష్టించాడు. ప్రమథ గణాలతో పాటుగా, ఆ వీరభద్రుడు దక్షుడి మీద దాడి చేశాడు. అక్కడ యజ్ఞానికి వచ్చిన వారందరినీ చ...