మనిషి శరీరాన్ని పోలిన మెత్తటి శరీరం గల నరసింహ స్వామి విగ్రహం ఎక్కడుంది? Hemachala Lakshmi Narasimha Swamy Mallur
సంతాన భాగ్యాన్ని ప్రసాదించే 4 వేల సంవత్సరాల నాటి హేమాచల నృసింహ ఆలయ రహస్యాలు! ఆర్త జన బాంధవుడిగా, భక్త కోటి రక్షకుడిగా, శంఖచక్రధారిని సమస్త జనులూ, భక్తి శ్రద్ధలతో కొలుస్తుంటారు. ధర్మ రక్షణా, దుష్ట శిక్షణ కొరకు, ఆ శ్రీ మహా విష్ణువు వివిధ అవతారాలెత్తినట్లు, మన పురాణాలు చెబుతున్నాయి. ఆయనెత్తిన అవతారాలలో, నరసింహ స్వామి అవతారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందువల్ల, ఆ స్వామిని యుగయుగాలుగా, సామాన్యుల నుంచి రారాజుల వరకూ, ఎన్నో ఆలయాలను నిర్మించి, భక్తితో కొలుస్తున్నారు. అటువంటి ఒక పురాతన నరసింహ స్వామి వారి ఆలయంలోని మూలవిరాట్టు, ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. 4000 సంవత్సరాల మునుపు కట్టిన ఆ ఆలయంలోని స్వామి వారి విగ్రహాన్ని చూసిన వారు, నోట మాట రాక, సంభ్రమాశ్చార్యాలలో మునిగిపోతే, శాస్త్రవేత్తలు మాత్రం, ఈ వింత ఎలా జరుగుతోందనే విషయం అంతుబట్టక, తలలు పట్టుకుంటున్నారు. అందరినీ ఆశ్చర్యపరుస్తోన్న ఆ నరసింహ స్వామి వారి విగ్రహంలో దాగిన రహస్యమేంటి? ఆ ఆలయం ఎక్కడుంది? దాని వెనుకనున్న అసలు చరిత్ర ఏమిటి? అనే విషయాలను, ఈ రోజు తెలుసుకుందాము.. ఈ ఆ...