శ్రీకృష్ణావతారతత్వం! కుచేలుడు! Sri Krishna Kuchela - Sri Krishnavatara Tatvam

కుచేలుడు! శ్రీకృష్ణావతారతత్వం! TELUGU VOICE నిజానికి మానవుడికి ముగ్గురు గురువులుంటారు! వారు ఎవరు? పరీక్షిత్ మహారాజు అంతరంగంలో, భక్తి భావం సంపూర్ణంగా నాటుకుంది. శ్రీకృష్ణుని మహిమలను చెప్పే కథలు ఎన్ని విన్నా, ఇంకా వినాలన్న కోరిక పెరుగుతోంది. ఎంతటి విషయలోలుడైనా, ఒక్కసారి శ్రీకృష్ణుని చరిత్ర వింటే, ఇక సంసార లంపటంలో చిక్కుకోడు. పశుపక్ష్యాదులకూ, మానవులకూ ఒక్క విషయంలోనే భేదం ఉంది. అది, చేతులతో భగవంతునికి సేవలు చేయగలగడం, చెవులతో భగవానుని పుణ్య గాథలను వినడం, శిరస్సు వంచి ఆయన పాద పద్మాలకు నమస్మరించడం, కన్నులతో ఆయన దివ్య మంగళ విగ్రహాన్ని దర్శించగలగడం, భక్తుల పాదోదకాన్ని గ్రహించడం, ఇలా ఒక్కటేమిటి, ఈ విధంగా అంగాంగం భగవంతునికై వినియోగించగలగడమే, మానవ జన్మకు సాఫల్యం. ఎవరు భగవంతుడిచ్చిన అవయవాలను భగవత్సేవకు వినియోగించరో, అతడు పాపాత్ముడు, కృతఘ్నుడు అవుతాడు. కావున ఓ మునీంద్రా! నా చివరి ఘడియల వరకూ శ్రీహరి సేవలోనే గడపాలని ఉంది. అందుకే ఆయన లీలలను నాకు చెబితే, తనివితీరా వినాలని ఉందన్నాడు. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/C7kNPs6Rn3E ] పరీక్షిత్ మహారాజు మాటలకు శుకమహర్షి ఇలా బదులిచ్చాడు. ర...