శంభలలో ఉన్న దివ్య మణి! A Truly Powerful Gem - The Chintamani Stone
శంభలలో ఉన్న ఆ దివ్య మణి రహస్యం మీకు తెలుసా? దుర్బుద్ధితో ఆ మణిని చేజిక్కించుకోవాలనుకున్న వారు ఏమైపోయారు? శంభల.. ఆ పేరు తలచుకుంటేనే, ఏదో తెలియని పులకింత కలుగుతుంది. బాహ్య ప్రపంచానికి తెలియని మహా నగరమది. ఎందుకంటే, అది అన్ని ఇతర ప్రాంతాల తీరులో, సాధారణమైన నగరం కాదు. అక్కడ ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుంది. దేవతలు సంచారం చేసే దైవభూమి అది. ఆ ప్రాంతాన్ని చేరుకోవాలంటే, శారీరక, మానసిక ధైర్యంతో పాటు, యోగం కూడా ఉండాలని, హిందూ, బౌద్ధ గ్రంథాలు స్పష్టంగా చెబుతున్నాయి. బౌద్ధులు ఆ ప్రదేశాన్ని స్తుతిస్తూ, "ఓం శ్రీ మణిపద్మేహుం" అని స్మరిస్తారు. మహిమాన్విత వ్యక్తులు జీవించే, మహోన్నతులకు మాత్రమే కనిపించే ఆ అత్యద్భుత ప్రదేశంలో దాగి ఉన్న రహస్యాలేంటి? ఆ నిగూఢ నగరం ఎలా ఉంటుంది? శంభల నగరానికి వెళ్ళి, సజీవంగా తిరిగివచ్చిన వారెవరైనా ఉన్నారా - వంటి ఆసక్తికర విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము.. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/QMlIeuhRDak ] "స్వరవ్యయం స్వర్గ నాక త్రిదివత్రి దశాలయః సురలోకో ద్యోదివౌద్వే త్రివిష్టపం" శంభల నగరానికి మరోపేరు త్రివిష్టపం. మన పురాణాలలో దీనిన...