తండ్రి గర్భంలో జన్మించిన అతడు ఎవరు? Mandhata – The legendary King
తండ్రి గర్భంలో జన్మించిన అతడు ఎవరు? హిందూ పురాణాల ప్రకారం ఇక్ష్వాకు వంశ కీర్తి ఆ చంద్ర తారార్కం నిలిచిపోతుంది. షోడశ మహారాజులలో ఓకడిగా కీర్తిగడించిన, ఇక్ష్వాకు వంశస్థుడు మాంధాతకు సంబంధించిన ప్రస్తావన, మహాభారతంలోని శాంతి పర్వము, వన పర్వములో కనిపిస్తుంది. ఈ షోడశమహారాజులకు సంబంధించిన వీడియోని గతంలో మన చానెల్ లో పుబ్లిష్ చేశాను. చూడని వారికోసం దాని లింక్ ను క్రింద డిస్క్రిప్షన్ లో పొందు పరిచాను. ఎంతో విచిత్రమైన మాంధాత జననం ఎలా జరిగింది? అతి బలవంతుడైన రావణుడితో మాంధాత యుద్ధం ఎందుకు చేయవలసి వచ్చింది? ఇంద్ర సింహాసనాన్ని అధిష్టించాలనుకున్న మాంధాత కోరిక నెరవేరిందా? భూమండలాన్ని ఏకచ్ఛాత్రిధిపతిగా ఏలిన మాంధాతకు మరణం ఎలా సంభవించింది - వంటి ఆసక్తికర విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము.. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/bAds8CIzcuw ] అరణ్యవాసంలో ఉన్న పాండవులు, సైంధవారణ్యంలోకి ప్రవేశించారు. అక్కడ ప్రవహిస్తున్న యమునా నదిని చూసి, వారితో ఉన్న రోమశుడు ఇలా చెప్పసాగాడు. ధర్మరాజా, ఇది యమునా నది. గంగా నదితో సమానమైనది. దీని తీరాన మాంధాత అనే మహారాజు ఎన్నో యాగాలు చేశాడు. ఆయన చరిత్ర ...