Posts

Showing posts with the label Vaidika Karma

వైదిక కర్మలు! Vaidika Karma భగవద్గీత Bhagavad Gita

Image
వైదిక కర్మలు! స్వంత మనోబుద్ధుల ఆధారంగా నమ్మకం ఉండకూడదంటూ ఏం చెప్పాడు శ్రీకృష్ణుడు? 'భగవద్గీత' సప్తదశోధ్యాయం - శ్రద్ధా త్రయ విభాగ యోగం (25 – 28 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పదహేడవ అధ్యాయం, శ్రద్ధా త్రయ విభాగ యోగము. ఈ రోజుటి మన వీడియోలో, శ్రద్ధా త్రయ విభాగ యోగములోని, 25 నుండి 28 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము.. [ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/flwDZn97klA ] ఓం తత్ సత్ అనే పదాలకు అర్థాలను ఇప్పుడు చూద్దాం.. 00:46 - తదిత్యనభిసంధాయ ఫలం యఙ్ఞతపఃక్రియాః । దానక్రియాశ్చ వివిధాః క్రియంతే మోక్షకాంక్షిభిః ।। 25 ।। ప్రతిఫలములను ఆశించని వారు కానీ, ఈ భౌతిక బంధనముల నుండి విముక్తి పొందటానికి ప్రయిత్నించే వారూ, తపస్సు, యజ్ఞము, మరియు దానము చేసేటప్పుడు, ‘తత్’ అన్న పదమును ఉచ్ఛరిస్తారు. సమస్త కర్మల ప్రతిఫలములూ, ఆ భగవంతునికే చెందుతాయి. కాబట్టి, ఏ యజ్ఞమయినా, తపస్సయినా, లేదా దానమైనా, ఆ పరమేశ్వరుని ప్రీతికోసమే అర్పించి, పవిత్రం చేయబడాలి. ఇక ఇప్పుడు శ్రీ కృష్ణుడు, బ...