వసంత పంచమి 2024

అందరికీ 'వసంత పంచమి' శుభాకాంక్షలు 🙏 చదవుల తల్లి సరస్వతీ దేవి పుట్టిన రోజు కాబట్టి వసంత పంచమిని సరస్వతీ పంచమి అని అంటారు. ఫిబ్రవరి 14వ తేదీ 2024, మాఘ శుక్ల పంచమి. దీనికే వసంత పంచమి (Vasant Panchami), శ్రీ పంచమి, మదన పంచమి అనే పేర్లు కూడా ఉన్నాయి. జ్ఞానము మనిషిని మనీషిగా తీర్చిదిద్దుతుంది. జ్ఞానము, విద్య, చదువు పర్యాయపదాలు. విద్యకు అధిదేవత, జ్ఞానప్రదాయిని అయిన శ్రీ సరస్వతీదేవి జన్మదినంగా భావించి, స్మరించి, పూజించే రోజే వసంత పంచమి. ఆ తల్లి కటాక్షం కోసం అందరూ పూజలు జరిపే పర్వదినమే వసంతపంచమి. ఈ రోజునే క్షీరసాగర మథన సమయంలో మహాలక్ష్మి ఆవిర్భవించిన కారణంగా మదన పంచమి అని కూడా పేర్కొంటారు. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ । విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ।। యా కుందేందు తుషార హార ధవళా, యా శుభ్ర వస్త్రావృతా । యా వీణా వరదండ మండిత కరా, యా శ్వేత పద్మాసనా ।। యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్-దేవైః సదా పూజితా । సా మామ్ పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా ।। సరస్వతీ కటాక్షం: * బ్రహ్మదేవుడంతటి వాడే పరాశక్తిని శారదామాత రూపంలో దర్శించి, ఆరాధించి ఆమె కృపవల్ల సృష్టి రచనను సృజనాత్మకంగా ఆర...