Vasuki indicus is the NEW KING of snakes! | నాగుల రారాజు!

నాగుల రారాజు! ఈ సృష్టిలో నీలి తిమింగలాల పుట్టుకకు వాసుకీ సర్పమే కారణమా? పురాణ, ఐతిహాసిక కాలం నుంచీ ఇప్పటి వరకూ భూమిపై తిరుగాడిన జీవులలో ఎవ్వరికీ అంతుబట్టని జీవులుగా పాములకు ప్రత్యేక స్థానం ఉంది. యుగ యుగాలుగా పాములకు సంబంధించిన ఎన్నో కథలూ కథనాలూ, ఎప్పటికప్పుడు మనలో ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా అత్యంత భారీ సర్పాలు ఎక్కడున్నాయనే ప్రశ్నకు సమాధానం కోసం మానవులు నేటికీ అన్వేషిస్తూనే ఉన్నారు. ఆ అన్వేషణలో భాగంగా, పూర్వం మన భూమిపై అతిపెద్ద పాములు ఉండేవనీ, వాటిలో దక్షిణ అమెరికాలో కనిపెట్టబడిన Titanoboa అనే పాములు కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల క్రితం ఉండేవనీ, అవి భారీ డైనోసార్లను సైతం చంపి తినేసేవనీ కనుగొన్నారు. దానిని బట్టి అవి ఎంత భారీ పరిమాణంలో ఉండేవో ఊహించుకోవచ్చు. అయితే, మానవ జాతి పుట్టుకకు ముందే, వాసుకి అనే భారీ సర్పం అప్పటి మన భారత భూభాగంపై తిరుగాడిందనీ, అది Titanoboa కంటే అతి పెద్ద పామనీ, అసలు నాగ జాతిలో ఇదే అతి పెద్ద పాము కావడంతో, దానిని రాజనాగం అని పిలుస్తారనీ తాజాగా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇదే క్రమంలో మొన్నీ మధ్య బ్రెజిల్ లో కనిపించిన భారీ అనకొండా శాస్త్రవేత్తల ...