Was being Kaikeyi easy? ‘కైకేయి’ది స్వార్ధమా? త్యాగమా?

‘కైకేయి’ది స్వార్ధమా? త్యాగమా? TELUGU VOICE రాముడు అడవుల పాలైనా.. భర్త మరణానికి ప్రత్యక్ష కారకురాలైనా.. రామచరితం రసరమ్య భరితం. రామాయణంలాగా లోక వ్యవహారాన్ని విస్పష్టంగా బోధించే కావ్యం మరొకటి లేదన్నది, ఆర్యోక్తి. ఆదికవి వాల్మీకి నుంచి నేటి వరకూ, రమణీయమైన రామగాధ, పలుభాషలలో, పలు రీతులలో రూపు దిద్దుకుంటూ, భారతావని లోనే కాకుండా, భారతీయుల సంస్కృతి ప్రసరించిన అన్య దేశాలలోనూ ప్రచార ప్రశస్తి పొందింది. రామాయణం ఆదికావ్యం. వాల్మీకి మహర్షి ఈ మహాకావ్యాన్ని రచించడానికి కారణం, బ్రహ్మానుగ్రహం. భారత దేశంలోనూ, భారతీయ వాఙ్మయంలోనూ, సీతారాములు ప్రతి అణువులోనూ, ప్రతి అక్షరంలోనూ ప్రకాశించే దైవదంపతులు. రామాయణాన్ని చదవడం వల్ల, తల్రిదండ్రుల పట్ల భక్తి, సోదర ప్రీతి, జ్యేష్టానువర్తనం, లోకమర్యాదానుసరణం, ప్రతిజ్ఞా పాలనం, ఆశ్రిత వాత్సల్యం, స్వామికార్య నిర్వహణం, స్వార్ధపరత్వ నివృత్తి, చిత్త శుద్ధీ, పరోపకార బుద్ధివంటి అనేక సద్గుణాలు అలవడడానికి ప్రోత్సహిస్తుంది. అటువంటి రామాయణ గాధలో, కైకేయి తన దాసీ అయిన మంథర మాటలు విని, రాముడిని ఆడవుల పాలుజేసి, భర్త మరణానికి కారకురాలై, అటు కన్నబిడ్డ ప్రేమకూ, ఇటు పెంచిన బిడ్డ మామకారా...