శూద్రుడైన శంభూకుడిని ఏం తప్పు చేశాడని శ్రీ రాముడు వధించాడు? Why Did Lord Rama Kill Shambuka?
శూద్రుడైన శంభూకుడిని ఏం తప్పు చేశాడని శ్రీ రాముడు వధించాడు? డా. బి.ఆర్. అంబేద్కర్ ‘శంభూక వధ’ గురించి ఏమని వివరించారు? లోకాభిరాముడిగా, అవతార పురుషుడైన శ్రీ రామచంద్రమూర్తి, మచ్చలేని చందమామగా, మన ఇతిహాసాలలో పేర్కొనబడ్డాడు. అయితే, ఆ అయోధ్య రాముడి జీవితంలో తీసుకున్న రెండు నిర్ణయాలను, కొంతమంది వ్యతిరేకిస్తారు. అటువంటి వాటిలో ఒకటి, గర్భవతియైన సీతామాతను అడవులలో వదిలివేయడం, రెండవది, తపస్సు చేసుకుంటున్న శూద్రుడైన శంభూకుడిని వధించడం. అయితే, మనం ఈ రోజు శంభూకుడిని రాముడు ఎందుకు వధించాడు? అగ్రవర్ణాల ఆధిపత్యం కారణంగా, తపస్వి అయిన శంభూకుడిని సంహరించాల్సి వచ్చిందా? శంభూక వధ గురించి, ఉత్తరకాండ లో, 74, 75, 76 వ సర్గలలో ఏం ఉంది - అనే విషయాలతో పాటు, శంభూక వధ, త్రేతా యుగంలోని యుగ ధర్మానుసారం ఎలా అన్వయమైంది? ఈ కలియుగంలోని యుగధర్మము గురించి కూడా, అందులోనే ఉన్న ప్రస్తావనను క్లుప్తంగా పరిశీలిద్దాము. వీడియొను పూర్తిగా చూడకుండా, తొందపడి కామెంట్ చేయవద్దని ప్రార్ధిస్తున్నాను. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/jrfF6ofOlfY ] ఆనాటి యుగ ధర్మం ప్రకారం, ఒక రాజు ధర్మ పరిపాలన చేస్తే, ఆ రాజ్యంలో అకాల మ...