అభిమన్యుడిని శ్రీకృష్ణుడు ఎందుకు కాపాడలేదు? Why Lord Krishna didn't save Abhimanyu
అభిమన్యుడిని శ్రీకృష్ణుడు ఎందుకు కాపాడలేదు? అన్నీ తెలిసిన కృష్ణుడు 16 ఏళ్ల చిరు ప్రాయంలో అభిమన్యుడి మరణాన్ని ఎందుకు అడ్డుకోలేదు? పంచమ వేదంగా ఖ్యాతిగాంచిన మహాభారతంలోని వీర యోధులు అనగానే, ముందుగా అందరి మదిలో మెదిలే పేరు 'అభిమన్యుడు'. పాండవ మధ్యముడు అర్జునుడు, శ్రీకృష్ణుడి సోదరి సుభద్రాదేవిల ముద్దుల తనయుడు అభిమన్యుడు. అంటే, సాక్షాత్తు శ్రీ కృష్ణుడికి మేనల్లుడు. తల్లి కడుపులో ఉన్న సమయంలోనే తండ్రి నుంచి అస్త్రశస్త్ర విద్యలను అభ్యసించిన జ్ఞాని. పుట్టకముందే చక్రవ్యూహంలోకి ప్రవేశించే జ్ఞానాన్ని సంపాదించాడు. అయితే, ఆ చక్ర వ్యూహం నుంచి బయటపడే మార్గం తెలియక, 16 ఏళ్ల చిరు ప్రాయంలో మరణించాడు. అభిమన్యుడు యుద్ధంలో ఇలా వీర మరణం పొందడం వెనుక కారణం ఏంటి? ఎందుకు శ్రీ కృష్ణుడు కూడా తన మేనల్లుడు అభిమన్యుడిని కాపాడకుండా మిన్నకుండిపోయాడు? వంటి సందేహాలను నివృత్తి చేసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి, మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను.. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/wKZGYNXa9V4 ] మహాభారతం అనగానే మనకు గుర్తుకు వచ్చేది, కురుక్షేత్ర మహాసంగ్రామం...